స‌చిన్: ఎ బిలియ‌న్ డ్రీమ్స్ ఫ‌స్ట్ డే షాకింగ్ క‌లెక్ష‌న్స్

భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన స‌చిన్‌: ఎ బ‌లియ‌న్ డ్రీమ్స్ సినిమా ఎలాంటి ప‌బ్లిసిటీ లేకుండా భారీగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే అనూహ్య‌మైన రెస్పాన్స్ వచ్చింది. హిందీ – మరాఠి – తమిళ్- తెలుగు – ఇంగ్లీష్ భాషల్లో రియాక్ష‌న్ అయిన ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద రూ 8.40 కోట్లు కొల్ల‌గొట్టింది.

రెగ్యుల‌ర్ సినిమాలా కాకుండా ఓ డాక్యుమెంటరీ తరహాలో సచిన్ జీవితాన్ని జేమ్స్ ఎర్స్ కిన్ తెరకెక్కించారు. బాలీవుడ్‌లో గ‌తంలో ఎంఎస్ ధోని, అజారుద్దీన్ బయోగ్రఫీలపై సినిమాలు వచ్చినా ఆ సినిమాల్లో బాలీవుడ్ న‌టులు ముఖ్య‌పాత్ర పోషించారు. కానీ స‌చిన్ సినిమాలో స‌చినే న‌టించ‌డంతో అటు క్రికెట్ అభిమానులు, ఇండియ‌న్ సినిమా జ‌నాలు ఈ సినిమాపై మంచి అంచ‌నాలు పెంచుకున్నారు.

సినిమాకు అటు రివ్యూవ‌ర్ల‌తో పాటు ప్రేక్ష‌కుల నుంచి సైతం అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రి స‌చిన్ లైఫ్ హిస్ట‌రీతో తెర‌కెక్కిన ఈ స‌చిన్‌: ఎ బ‌లియ‌న్ డ్రీమ్స్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.