సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా అన‌సూయ వ‌య‌స్సు

బుల్లితెర మీద జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌తో హాట్ హాట్ యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయిన అన‌సూయ ఇటీవ‌ల వెండితెర మీద కూడా త‌న అంద‌చందాల‌తో మాంచి కిక్ ఇస్తోంది. త‌న‌కు వ‌చ్చిన హాట్ ఇమేజ్‌ను నిలుపుకునేందుకు సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌కు చేరువుగా ఉంటోంది. ఇటీవ‌ల అర్జున్‌రెడ్డి సినిమాతో పాటు కొన్ని విష‌యాల్లో ఓపెన్‌గానే త‌న అభిప్రాయం చెపుతోన్న అన‌సూయ‌పై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

సోష‌ల్ మీడియాలో ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ వయస్సు 42 అని నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ చాలా మందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇలా కామెంట్స్ రావడానికి కారణం ఆమె చాలా విషయాలలో సోషల్ మీడియాలో కాస్త డేరింగ్ అండ్ డాషింగ్‌గా త‌న అభిప్రాయాలు చెప్ప‌డ‌మే.

కాంట్రవర్సీ విషయాల‌లో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆమె చేసే కామెంట్స్‌కు నొచ్చుకున్న నెటిజన్లు ఊరుకుంటారా. అనసూయ డ్రెస్సింగ్ మీద విపరీతమైన సెటైర్లు వేస్తూ అనసూయకి చుక్కలు చూపిస్తున్నారు. దీనికి అనసూయ సమాధానం ఇస్తూ నేను చేసేది ఎక్స్ పోజింగ్ కాదు యాటిట్యూడ్ అని చెప్పి తప్పించుకుందట.

దాంతో మరింత రెచ్చిపోయిన నెటిజన్లు అనసూయ వయస్సు 42 అని పోస్ట్ లు చేస్తూ మరింత రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారట.ఇవేమీ పట్టనట్టు అనసూయ తన పని తానూ చేసుకుంటూ ఆ కామెంట్స్ మీద స్పందించలేదట.