బాబు ఏరి కోరి తెచ్చుకుంటే బ‌ల్లెమ‌వుతున్న‌ మంత్రి!

ఇప్ప‌టికే మంత్రుల‌పై విప‌రీత‌మైన ఆరోప‌ణ‌లు.. ఒక‌రితో ఒక‌రికి స‌ఖ్య‌త లేకపోవ‌డం.. ఇలా సీఎం చంద్ర‌బాబుకు మంత్రుల వ‌ల్ల త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. ఇక తాజాగా మ‌రో మంత్రిపై ఆయ‌న‌కు ఫిర్యాదులు అంద‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇసుక మాఫియా, డ్ర‌గ్ మాఫియా.. ఇలా ఏపీలో ఆయిల్‌ మాఫియా కూడా చెల‌రేగుతోంద‌నే విమ‌ర్శ‌లు జోరందుకుం టున్నాయి. అంతేగాక దీనికి ఒక మంత్రి అండ‌గా నిలుస్తున్నార‌ని, క‌మీష‌న్లు తీసుకుంటూ దందాల‌కు పాల్ప‌డుతు న్నార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. ఈ విష‌యంపై పారిశ్రామిక వేత్త‌ల నుంచి సీఎం చంద్ర‌బాబుకు కూడా ఫిర్యాదులు అందాయ‌ట‌.

చంద్ర‌బాబు కేబినెట్‌లో దూకుడుగా దూసుకుపోతున్న మంత్రి ఎవ‌రంటే వెంట‌నే గుర్తొచ్చే పేరు సోమిరెడ్డి చంద్ర‌మో హ‌న్ రెడ్డి!! కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, ఇత‌ర నేత‌ల‌పై దుందుడుకుగా దాడి చేస్తుంటారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. ఆయ‌నపై ఉన్న న‌మ్మ‌కంతో చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి అప్ప‌గించారు. ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి త‌న మార్కు చూపిస్తూ వ‌స్తున్నారు. మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఆయనపై సీఎంకు ఫిర్యాదు చేశారు.

అయితే చంద్ర‌బాబు ఇప్ప‌టివ‌ర‌కూ దీనిపై దృష్టిపెట్ట‌లేదు. దీంతో మరింత చెలరేగిపోతున్నారట సోమిరెడ్డి. ప్రస్తుతం సోమిరెడ్డిపై ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. కృష్ణపట్నం రేవులో క్రూడాయిల్‌ మాఫియాకు మంత్రి సోమిరెడ్డి అండదండలు అందిస్తున్నారనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఆయిల్‌ సరఫరా చేసే లారీల నుంచి ఆయన కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోప‌ణ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఈ ఆయిల్‌ మాఫియాపై కొంత మంది పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలిసి వాస్తవాలు వివరించడమే గాక మంత్రి సోమిరెడ్డి ప్రమేయం ఉందని ఫిర్యాదు చేశారు.

అంతేగాక జిల్లాలోనూ ఆయ‌న వ్య‌వ‌హారశైలిపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తుంటార‌ని, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జుల‌ను చేర‌దీసి వారికి వ్య‌తిరేకంగా వేరే వ‌ర్గానికి మ‌ద్ద‌తు ఇస్తుంటార‌ని ఇప్ప‌టికే కొంద‌రు టీడీపీ అధినేత దృష్టికి గతంలోనే తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం వీటి గురించి తెలుసుకున్న సోమిరెడ్డి.. చంద్రబాబును కలిసేందుకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారట. వెంటనే ఆయ‌న దూకుడుకు క‌ళ్లెం వేయాల‌ని పార్టీ నేత‌లు గ‌ట్టిగా కోరుతున్నార‌ట‌. లేకుంటే ప‌రిస్థితి త‌ల్ల‌కిందుల‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నార‌ట‌. మ‌రి సోమిరెడ్డిపై చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే!!