సుబ్బ‌రాజుకు సిట్ బంప‌ర్ ఆఫ‌ర్‌

July 21, 2017 at 1:02 pm
Subbaraju

డ్రగ్స్ కేసులో నటుడు సుబ్బరాజును ఎక్సైజ్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్ప‌టికే బుధ‌వారం డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌ను, గురువారం సినిమాటోగ్రాఫ‌ర్ శ్యాం కె.నాయుడును విచారించిన పోలీసులు శుక్ర‌వారం క్యారెక్ట‌ర్ న‌టుడు సుబ్బ‌రాజును విచారించారు. ఇక సుబ్బ‌రాజు శుక్ర‌వారం ఉద‌యం 9.45 గంట‌ల‌కే నాంప‌ల్లిలోని అబ్కారీ భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఇక ఈ రోజు సుబ్బ‌రాజును ప్ర‌శ్నిస్తోన్న అధికారులు మారిపోయారు. గ‌త రెండు రోజులు విచారించిన వారు కాకుండా మూడో రోజు కొత్త టీం రంగంలోకి దిగింది.

తాము అడిగిన ప్ర‌శ్న‌ల‌కు నేరుగా, ఇబ్బంది పెట్ట‌కుండా స‌మాధానం చెపితే ఎంతోసేపు విచార‌ణ ఉండ‌ద‌ని, అలా కాకుంటే ఇబ్బంది పెడుతూ స‌మాధానాలు చెపితే చాలా సేపు, ఎక్కువ ప్ర‌శ్న‌ల‌తో విసిగించాల్సి ఉంటుంద‌ని సుబ్బ‌రాజుకు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. ఇక సుబ్బ‌రాజుకు డ్ర‌గ్స్ అల‌వాటు ఉందా ? అనే తొలి ప్ర‌శ్న వేసిన‌ట్టు స‌మాచారం.

పూరీ జ‌గ‌న్నాథ్‌తో ఎలా స‌న్నిహితంగా ఉంటారు ? పూరీతో క‌లిసి త‌ర‌చూ బ్యాంకాంగ్ ఎందుకు వెళుతున్నారు ? బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారు ? అని ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. ఇక డ్రగ్స్ కేసులో కీలకంగా మారిన కెల్విన్‌తో పరిచయంపై అధికారులు ప్రశ్నలు వేశారని తెలుస్తోంది.

ఇక కెల్విన్ గురించి కూడా ప్ర‌శ్నలు వేశార‌ని అక్క‌డ అధికారుల ద్వారా తెలిసింది. కెల్విన్ తెలుసా ? ఒకవేళ తెలిస్తే ఎలా పరిచయం అయ్యారు ? సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది? నీ రక్తనమూనాలు, గోళ్లు, కేశాలు పరీక్షలకు తీసుకోవచ్చా ? లాంటి ప్ర‌శ్న‌లు సుబ్బ‌రాజుకు వేసిన‌ట్టు స‌మాచారం.

 

సుబ్బ‌రాజుకు సిట్ బంప‌ర్ ఆఫ‌ర్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts