డ్ర‌గ్స్ లిస్టులో స్టార్ హీరో కూతురు, స్టార్ క‌మెడియ‌న్‌

టాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోన్న డ్ర‌గ్స్ ఇష్యూలో రోజుకో కొత్త నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. శుక్ర‌వారం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టును సిట్ అధికారులు విచారించిన‌ప్పుడు చాలా నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డైంది. సుబ్బ‌రాజు డ్ర‌గ్స్‌తో లింకున్న ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఓ స్టార్ హీరో కూతురుతో పాటు స్టార్ క‌మెడియ‌న్ స‌హా మరో పది మంది వరకు సినీ ప్రముఖుల పేర్లను చెప్పినట్లు విశ్వనీయంగా తెలిసింది. డ్రగ్స్ పంపిణీకి అడ్డాలుగా ఉన్న అనేక పబ్‌లు, వాటికి సంబంధించిన ఆధారాల‌ను కూడా సుబ్బ‌రాజు సిట్‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక హీరోయిన్ చార్మీ సోద‌రుడి స‌హాయంతో పంజాబ్‌కు చెందిన డ్రగ్ మాఫియాకు లింకులు ఏర్పరుచుకుని టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయాన్నీ సుబ్బరాజుతో చెప్పించినట్లు వెల్లడైంది.

సుబ్బరాజును మూడు సిట్టింగుల్లో సిట్ అధికారులు విచారణ చేశారు. సుబ్బ‌రాజును విచారించాక ఎక్సైజ్ డైరెక్ట‌ర్ అకున్ స‌బ‌ర్వాల్ డైరెక్టుగా మీడియాతో మాట్లాడుతూ సుబ్బ‌రాజు విచార‌ణ‌లో త‌మ‌కు చాలా స‌హ‌క‌రిస్తున్నార‌ని చెప్పారు. దీనిని బ‌ట్టి సుబ్బ‌రాజు చాలా కీల‌క పేర్లు వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.

ఇక డ్ర‌గ్స్ ఉదంతంలో కీల‌క సూత్ర‌ధారి కెల్విన్ ముఠాతో టాలీవుడ్ న‌టులకు ఉన్న సంబంధాల‌పై కూడా విచారించిన‌ట్టు తెలుస్తోంది. ఇక సుబ్బ‌రాజు చెప్పిన పేర్ల‌లో టాలీవుడ్ స్టార్ హీరో కూతురు, ఆ స్టార్ క‌మెడియ‌న్ ఎవ‌రా ? అన్న అంశంపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. వారికి డ్ర‌గ్స్ మాఫియాకు ఉన్న లింకులు గురించి ఆరా తీస్తున్నారు. ఈ పేర్లు ఆధారాల‌తో స‌హా ఎక్క‌డ బ‌య‌ట‌కు వ‌స్తాయోన‌ని…చాలా మంది ప్ర‌ముఖుల గుండెలు బ‌ద్ద‌ల‌వుతున్నాయి.