చంద్ర‌బాబు జోరు… జ‌గ‌న్ బేజారు!

ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీలు అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య ఇప్పుడు విచిత్ర వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అధికార పార్టీ సాధార‌ణంగా జోరు మీదుండ‌డం స‌హ‌జం. అయితే, ఇప్పుడు ఆ పార్టీ జోరుతో పాటు మ‌రింత హుషారుగా కూడా ఉంది. ముఖ్యంగా మొన్న జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఫ‌లితాల అనంత‌రం టీడీపీలో పెద్ద ఎత్తున కొత్త ఆక్సిజ‌న్ అందింది. దీంతో అధినేత చంద్ర‌బాబు స‌హా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చాలా […]

మిష‌న్‌-175 సాధ్య‌మేనా బాబు?

ఆశ‌.. అత్యాశ ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తామే అధికారంలోకి రావాల‌నుకుంటారు.. ఇది స‌హ‌జ‌మే! అధికారంలోకి రావాల‌నుకోవ‌డం ఒక ఎత్త‌యితే.. మొత్తం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తామే గెల‌వాల‌నుకోవ‌డం మాత్రం అత్యాశే అవుతుంది. ఇది విన‌డానికి కూడా కొంత కామెడీగానే ఉంటుంది. ఈ లెక్క‌లు వింటే కొంత ఆశ్చ‌ర్యం కూడా క‌లుగుతుంది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు లెక్క‌లు విన్నా ఇలాంటి అభిప్రాయ‌మే క‌లుగుతుంది. 2019 ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌ని ధీమాగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు […]

చంద్ర‌బాబు స‌ర్వేలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే

2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు? గ‌త ఎన్నిక‌ల్లో సీఎం క‌ల ఆశ‌కు కొద్ది దూరంలోనే నిలిచిపోయిన‌ జ‌గ‌న్‌.. ఈసారైనా ఆ కుర్చీని అందుకుంటాడా? ఎన్నిక‌ల్లో ప‌్ర‌శాంత్ కిషోర్ ఎంత వ‌ర‌కూ ప్ర‌భావం చూపగ‌ల‌డు? ఆయ‌న నిర్ణ‌యాల‌న్నీ పాటిస్తే జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేరుతుందా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇన్ని చేసినా 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు వ‌చ్చే సీట్ల సంఖ్య‌పై స‌ర్వేలు ఏం చెబుతున్నాయి అనే విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెల్ల‌డించారు. జ‌గ‌న్‌కు […]

ఎన్నో ఆశ‌లతో సైకిల్ ఎక్కితే ఇప్పుడు ఈ పరిస్థితి

2019.. అధికార టీడీపీకి ఇది ఎంతో కీల‌కం కాబోతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ఒక‌వైపు వైసీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోపక్క చుట్టూ స‌మ‌స్య‌లు, వివాదాలు, విమ‌ర్శలు! ఇవ‌న్నీ టీడీపీ అధినేత‌కు స‌వాళ్లు విసురు తున్నాయి. ఇంకా రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్నా.. ఇదంతా టీడీపీకి ముళ్ల బాటే కానుంది. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు లేన‌ట్టేన‌ని కేంద్రం స్పష్టంచేయ‌డంతో పాటు ఎన్నో ఆశ‌లు పెట్టుకుని టీడీపీలోకి వ‌చ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చెల‌రేగుతోంది. ఈనేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో […]

2019 నాటికి ప‌శ్చిమ‌లో టీ డీపీ అడ్ర‌స్ గ‌ల్లంతేనా?

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోట‌గా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మ‌ట్టికొట్టుకు పోయింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక‌లో తెలుగు త‌మ్ముళ్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, త‌మ్ముళ్ల మ‌ధ్య కుమ్ములాట‌ల‌తోనే కాలం గ‌డిచిపోతోంది. మాజీ మంత్రి పీత‌ల సుజాత కేంద్రంగా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు […]

లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించ‌డం బాబుకు ప‌రీక్షే

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌లు పెద్ద అగ్నిప‌రీక్ష‌లా మారాయి. ఆ ఎన్నిక‌ల్లో రెండోసారి గెలిచేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తోన్న బాబు ముందు మ‌రో పెద్ద స‌వాల్ కూడా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీని స్టేట్‌లో రెండోసారి గెలిపించ‌డం ఒక ఎత్తు అయితే, త‌న త‌న‌యుడు లోకేశ్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌కు స‌రైన బాట వేయ‌డం రెండో ప‌రీక్ష‌. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ గెలిచి బాబు సీఎం అయినా ఆ ట‌ర్మ్‌లో బాబు పూర్తికాలం సీఎంగా ఉంటార‌న్న […]

జ‌గ‌న్ హామీలు స‌రే.. లెక్క‌లు చూస్తే టెన్ష‌నే!! 

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌భేరి మోగించారు. అన్ని వ‌ర్గాల‌కు చేరువయ్యేలామొత్తం తొమ్మిది ప‌థ‌కాలు ప్ర‌క‌టించేశారు. దీనిపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే వీటి అమ‌లు ఎంత వ‌ర‌కూ సాధ్య‌మ‌నే దానిపైనే ఇప్పుడుచ‌ర్చ మొద‌లైంది. అల‌వికాని హామీలిచ్చి.. వాటిని నెర‌వేర్చేందుకు సీఎం చంద్ర‌బాబు ఎన్ని క‌ప్ప‌గంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జ‌గ‌న్ ఇచ్చిన హామీల అమ‌లు సాధ్య‌మ‌య్యేనా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌థ‌కాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంత‌మాత్రంగా ఉన్న‌ రాష్ట్ర ఆదాయ ప‌రిస్థితి. […]

2019 వార్ టీడీపీకి పూల‌పాన్పు కాదు

న‌వ్యాంధ్రప్రదేశ్‌కు తొలి సీఎం అయ్యేందుకు చంద్ర‌బాబు ఎన్నో క‌ష్ట‌నష్టాలు ప‌డ్డారు. వ‌రుస‌గా రెండుసార్లు ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైన ఆయ‌న ఈ ప‌దేళ్ల కాలంలో ఎంతోమంది సీనియ‌ర్ల‌ను వ‌దులుకున్నారు. కొంద‌రు పార్టీలు మారిపోతే, మ‌రి కొంద‌రు రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించ‌డం లేదా మ‌ర‌ణించ‌డం జ‌రిగాయి. 2004లో టీడీపీ చ‌రిత్ర‌లోనే ఘోర ప‌రాజ‌యం చూసింది. 2009లోను ముక్కోణ‌పు పోటీలో మ‌రోసారి వ‌రుస‌గా ఓడింది. ఇక 2004కు ముందు వ‌ర‌కు చంద్ర‌బాబు పాల‌న అంటే ఓ క్రెడిబులిటీ ఉండేది. ఉద్యోగులు […]

జ‌న‌సేన స‌ర్వే నిజ‌మా..?  కామెడీనా…?

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన 83 సీట్లు గెలుస్తుందంటూ జ‌న‌సేన అభిమాని నిర్వ‌హించిన స‌ర్వేలో తేల‌డం ఇప్పుడు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా పోటీ ప‌డుతూ ఉన్న స‌మ‌యంలో.. ఈ స‌ర్వే రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. అయితే దీనిపై అటు రాజకీయ నాయ‌కులు, ఇటు విశ్లేష‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఈ స‌ర్వే నిజ‌మా? అబ‌ద్ద‌మా? 83 సీట్లు ఎలా వస్తాయి? ఇంకా పార్టీ నిర్మాణ‌మే పూర్తిగా లేని జ‌న‌సేన‌కు […]