
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్ర మరో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాజన్న రాజ్యం స్థాపించాలనే ఏకైక ధ్యేయంతో వైసీపీ అధినేత ప్రారంభించిన ఈ పాదయాత్రకు అనూహ్యమైన స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ వస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయలో ప్రారంభమైన జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే పలు మైలు రాళ్లను దాటింది.