Tag Archives: ABN

పవన్ అజ్ఞానమా? లేక అభద్రతాభావమా ?

మీడియాపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మినీ యుద్ధ‌మే ప్ర‌క‌టించాడు. ప‌లు మీడియా సంస్థ‌ల అధినేత‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌రుస ట్వీట్‌లు పెడుతూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి నాలుగేళ్లు అయినా ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ ఇంత తీవ్రంగా ఎవ‌రినీ టార్గెట్ చేసిన దాఖ‌లాలు లేవు. కానీ ఇప్పుడు ఒక్క‌సారిగా ప‌వ‌న్ ఆవేశం చూస్తే మాత్రం అంద‌రిలోనూ ఎన్నో సందేహాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మీడియా అధినేత‌ల‌పై చేస్తున్న ట్వీట్లు ఇప్పుడు ఆయ‌న‌పై చుల‌క‌న భావాన్ని పెంచుతున్నాయ‌నే అభిప్రాయాలు

Read more

అమ‌రావ‌తిపై ఆంధ్ర‌జ్యోతికి అంత అత్యుత్సాహం ఎందుకో?

ప్రేమ ఉండొచ్చు! అది మ‌రీ శ్రుతి మించితే విక‌టించ‌డం ఖాయం! ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక విష‌యంలోనూ ఇదే వ్యాఖ్య వినిపిస్తోంది. ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అనుకూలంగా జ్యోతిలో నిత్యం అనేక క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. కొన్ని సార్లు.. కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని, అందుకే చంద్ర‌బాబు క‌ష్టం నీరుగారిపోతోంద‌ని సోక‌ణ్నాలు పెడుతుంది ప‌త్రిక‌. మ‌రికొన్ని సార్లు.. ఐఏఎస్ ల వ‌ల్లే బాబుకు అప్ర‌తిష్ట అంటూ క‌థ‌నాల‌ను వండి వారుస్తుంది. ఇంకొన్ని సార్లు.. ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు భేష్‌.. కానీ, మిగిలిన

Read more

జ‌గ‌న్‌పై నిప్పులు క‌క్కిన క‌లం నుంచి జాలు వారిన అమృతం!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా శ‌త్రువులు ఎంతో మంది ఉండొచ్చు!  ఆ మాట‌కొస్తే.. రాజ‌కీయంగా శ‌త్రువులు ఎవ‌రూ ఉండరనేది నేత‌ల మాట‌. కేవ‌లం రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు మాత్ర‌మే ఉంటార‌ని, చిర‌కాల మిత్రులు కూడా రాజ‌కీయాల్లో ఉండ‌ర‌ని అంటారు. ఒక‌వేళ ఉన్నా.. అప్ప‌టి అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వినియోగించుకుంటారు త‌ప్ప ద‌క్షిణాదిలో ఒక్క త‌మిళ‌నాడు త‌ప్ప మిగిలిన రాష్ట్రాల్లో నేత‌ల మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణ‌మే ఉంద‌ని చెబుతారు. అయితే, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ఎంత మంది శ‌త్రువులు ఉన్నారో..

Read more

జ‌గ‌న్ విష‌యంలో ద‌మ్మున్న ప‌త్రిక తీరు మారిందే

అవును! జ‌నాల అభీష్టానికి అనుకూలంగా ఎవ‌రైనా న‌డుచుకోవాల్సిందే! కొమ్ములు తిరిగిన మొన‌గాళ్లు సైతం.. జ‌నాల అభిమానం లేక‌పోతే.. చ‌తికిల ప‌డి శంక‌ర‌గిరి మ‌న్యాలు ప‌ట్టిన వారు కోకొల్లొలు..!! ఇప్పుడు ఇదే పంథాలో సాగుతోంది ఏపీలో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌..! క‌ర‌డుగ‌ట్టిన జ‌గ‌న్ వ్య‌తిరేక‌తను సైతం జ‌నాల అభీష్టం ముందు ప‌క్క‌న పెట్టింది! నిత్యం నానా మాట‌ల‌తో ఆడిపోసుకునే జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది. నిన్న‌టికి నిన్న పాద‌యాత్ర‌లో వైసీపీ అధినేత‌కు ల‌భించిన జ‌నాభిమానం ముందు ఆంధ్ర‌జ్యోతి విమ‌ర్శ‌నాత్మ‌క జ‌ర్న‌లిజానికి చాప‌చుట్టింది!

Read more

రాధాకృష్ణ‌ను జ‌గ‌న్‌ లైట్ తీస్కొన్నారా!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆరు నెలల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌య్యాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో గాని జ‌గ‌న్ మాత్రం అదిరిపోయే ప్ర‌ణాళిక‌ల‌తో జ‌నాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పాద‌యాత్ర స్కెచ్ ఇప్ప‌టికే రెడీ అయ్యింది. ఇక పాద‌యాత్ర‌కు త‌న సొంత మీడియా సాక్షి క‌వ‌రేజ్ ఒక్క‌టే స‌రిపోద‌ని తెలుసుకున్న జ‌గ‌న్ ఇత‌ర మీడియా సంస్థ‌ల

Read more

ఏపీలో బీజేపీ – టీడీపీ మ‌ధ్య కొత్త చిచ్చు

ఏపీకి ప్రత్యేక హోదా మిత్ర‌ప‌క్షాలు అయిన టీడీపీ – బీజేపీ మ‌ధ్య చాలా రోజుల పాటు చిచ్చు రాజేసింది. ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీలో బీజేపీ, టీడీపీ నేత‌లు చాలా రోజుల పాటు స‌వాళ్లు , ప్ర‌తిస‌వాళ్లు విసురుకున్నారు. చివరకు టీడీపీనే ‘ప్యాకేజీ’తో సరిపెట్టుకుని హోదా వేస్ట్ అని తేల్చటంతో అసలు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొద్ది రోజుల వ‌ర‌కు చంద్ర‌బాబుపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ నేత‌లు సైతం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు

Read more

Share
Share