Tag Archives: ADMK

త‌మిళ అసెంబ్లీ సాక్షిగా ఓడిన ముగ్గురు

త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం ప‌ళ‌నిస్వామి బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గుతారా ? లేదా ? అన్న ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఈ రోజు జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో పళనిస్వామి రాజకీయ చతురత ముందు మరోసారి పన్నీరు సెల్వం, డీఎంకే బొక్కబోర్లపడ్డాయి. త‌మిళ అసెంబ్లీలో కురుక్షేత్రాన్ని త‌ల‌పించేలా జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలో సీఎం పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. వ్యతిరేకంగా 11 వ్యతిరేక ఓట్లుపడ్డాయి. ఇక ఈ బ‌ల‌ప‌రీక్ష‌లో పైకి ప‌న్నీరు సెల్వం ఓడిన‌ట్లు క‌నిపిస్తున్నా ఓవ‌రాల్‌గా మాత్రం

Read more

ఆ ఈక్వేష‌న్స్‌కు బ‌లైన ప‌న్నీరు సెల్వం

కొద్ది రోజుల క్రితం త‌మిళ‌నాడులో చెల‌రేగిన జ‌ల్లిక‌ట్టు వివాదం కేంద్రం దిగి రావ‌డంతో తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత అక్క‌డ స్టార్ట్ అయిన పొలిటిక‌ల్ జల్లికట్టులో చివ‌రి గెలుపు ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్‌)ని వ‌రిస్తే… ఓ.పన్నీరు సెల్వం (ఓపీఎస్‌) ప‌రాజితుడు అవ్వాల్సి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు త‌మిళ జ‌నాలంద‌రూ పాపం ఓపీఎస్ అని అంటున్నారు. ఇక గ‌తంలోనే రెండుసార్లు అమ్మ జ‌య‌ల‌లిత జైలుకు వెళ్ల‌డంతో సీఎం అయిన ప‌న్నీరు సీఎం అయ్యి కొద్ది కాలానికే తిరిగి అమ్మ‌కోసం

Read more

ప‌ళ‌నిస్వామికి చెక్ పెట్టేందుకు ప‌న్నీర్ కొత్త వ్యూహం

త‌మిళ‌నాడు పాలిటిక్స్‌లో గ‌త ప‌క్షం రోజులుగా ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న ఉత్కంఠ‌కు తాజాగా తెర‌ప‌డినా శ‌నివారం వ‌ర‌కు ఇంకా ఇది కొన‌సాగ‌నుంది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌ళ‌నిస్వామి శ‌నివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంది. ముందు నుంచి తానే సీఎం అవుతాన‌ని ధీమాగా ఉన్న ప‌న్నీరుకు షాక్ ఇస్తూ ప‌ళ‌నిస్వామి గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకుని సీఎం అయ్యారు. దీంతో సీఎం పీఠంపై ఆశ‌ల‌తో ఉన్న ప‌న్నీరు రూటు మార్చారు. నేరుగా అమ్మ సమాధి

Read more

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వారం రోజుల ల‌గ్జ‌రీ ఖ‌ర్చెంతో తెలుసా

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఉత్కంఠ ప‌రిణామాల‌తో ఎట్ట‌కేల‌కు స‌మ‌సిపోయింది. జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ సీఎం పీఠం ఎక్కాల‌న్న ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. ఇక ఇప్పుడు సీఎం పీఠం రేసులో అమ్మ న‌మ్మిన‌బంటు ప‌న్నీరుసెల్వం వ‌ర్సెస్ చిన్న‌మ్మ న‌మ్మిన‌బంటు ప‌ళ‌నిస్వామి మాత్ర‌మే ఉన్నారు. శ‌శిక‌ళ‌కు అక్ర‌మాస్తుల కేసులో నాలుగు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డ‌డంతో రేపోమాపో ఆమెను పోలీసులు అరెస్టు చేయ‌డం ఖాయం. ఇక ఇప్పుడు శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తు తెలిపిన ఎమ్మెల్యేల్లో భ‌యం ప‌ట్టుకుంది. ప‌ళ‌నిస్వామికి మ‌ద్ద‌తు ఇస్తే

Read more

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌కు రిసార్ట్స్‌లో చిత్ర‌హింస‌లు

త‌మిళ‌నాడులో కొద్ది రోజులుగా హై స‌స్పెన్ష్ టెన్ష‌న్ క్రియేట్ చేసిన రాజ‌కీయ డ్రామాకు ఈ రోజుతో చాలా వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చేసింది. సీఎం అయ్యేందుకు అన్ని ర‌కాల ప్లాన్లు వేసిన వీకే శ‌శిక‌ళ ప్లాన్లు అన్ని బెడిసికొట్టాయి. ఆమెకు నాలుగు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డ‌డంతో ఆమె ముఖ్య‌మంత్రి అయ్యేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే వీలు కూడా లేదు. ఇదిలా ఉంటే ఎలాగైనా సీఎం అవ్వాల‌ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌తో

Read more

త‌మిళ సీఎం దీపానే…! శ‌శిక‌ళ‌కు షాకే

`అమ్మ‌`ను కోల్పోయిన త‌మిళ‌వాసుల‌కు స‌రికొత్త ఆశా`దీపం` దొరికింది. త‌మిళ రాజ‌కీయాల‌ను శాశించాల‌ని కోరుకుంటున్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ‌కు దీప రూపంలో ఊహించ‌ని షాక్ ఎదురైంది. జ‌య అన్న కూతురు దీపకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమెపై రోజురోజుకూ ఒత్తిడి అధిక‌మ‌వుతోంది. చెన్నై టీనగర్‌లోని ఆమె ఇంటికి ప్రతిరోజూ వేలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు వ‌చ్చి.. రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆమెను బ‌తిమాలుతున్నారు. చేతులు పట్టుకుని మరీ వేడుకుంటున్నారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన `చిన్న‌మ్మ‌`

Read more

జ‌య మృతిపై అనుమానాలు – అస‌లు నిజాలు..!

దివంగ‌త త‌మిళ‌నాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత‌ల అమ్మ‌.. పురుట్చిత‌లైవి జ‌య‌ల‌లిత మృతి చెందిన మూడు వారాల త‌ర్వాత ఇప్పుడు ఆమె మృత దేహానికి పోస్ట్ మార్ట‌మ్ చేయ‌నున్నారా? ఆమె మృతిపై అనుమానాలున్నాయ‌నే వార్త‌లు నిజ‌మేనా? ఆమెపై విష ప్ర‌యోగం జ‌రిగింద‌నే కామెంట్ల‌కు ఇప్పుడు బ‌లం చేకూరుతోందా? జ‌య‌ది సాధార‌ణ మ‌ర‌ణం కాదా? ఇప్పుడు ఇలాంటి అనుమానాలు తమిళనాడు ప్రజలనే కాదు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల జనాల్నిసైతం మ‌రోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జ‌య ఆస్ప‌త్రిలో చేరిన నాటి నుంచి

Read more

థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోన్న త‌మిళ పాలిటిక్స్‌

త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కేంద్రంగా పాలిటిక్స్ ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ సీఎం సీటును ద‌క్కించుకునేందుకు తీవ్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పిన వార్త‌లు పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం మూకుమ్మ‌డిగా పోయెస్ గార్డెన్‌కు వెళ్లి.. చిన్న‌మ్మ‌కు సాష్టాంగ‌న‌మ‌స్కారం చేసి.. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని సైతం విన్న‌వించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇంత‌లో రాష్ట్రంలో వ‌ర్ద పెను తుఫాను.. అనంత‌రం సీఎం ప‌న్నీర్ సెల్వం..

Read more

జ‌యకు వ్య‌తిరేకంగా శ‌శిక‌ళ కుటుంబం కుట్ర‌!

త‌మిళ‌నాడులో అమ్మ‌గా పూజ‌లందుకున్న మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఇప్పుడు లేరు. కానీ, ఆమె జ్ఞాప‌కాలు ఉన్నాయి. ఆమె వ‌దిలి వెళ్లిన వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమె ఎంత‌గానో ఇష్ట‌ప‌డిన మ‌నుషులు ఉన్నారు. ఇంత వ‌ర‌కే అంద‌రికీ తెలుసు! కానీ, ఆన‌మ్మిన మ‌నుషులే అమ్మ వెనుక కుట్ర‌లకు తెర‌దీశార‌ని, అమ్మ ప‌త‌నాన్ని కోరుకున్నార‌ని, అమ్మ అధికారం కోల్పోతే తాము అధికారంలోకి రావాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నార‌ని తెలుసా?? కానీ, ఇది నిజ‌మ‌ట‌! అమ్మ‌ను ఎంతో అభిమానిస్తున్నామ‌ని,

Read more