త‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో ట్విస్ట్‌

మొన్న‌టి వ‌ర‌కూ ఎన్నో మ‌లుపులు తిరిగిన త‌మిళ రాజ‌కీయాలు కుదుట‌ప‌డుతున్నాయి. ఎలాంటి థిల్ల‌ర్ సినిమాలోలోని ట్విస్ట్‌లు అక్క‌డ ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదేమో! ఇప్పుడిప్పుడే స‌ద్దుమ‌ణుగుతున్న త‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం!! మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు కూతురినంటూ ఒక మ‌హిళ మీడియా ముందుకు రావ‌డంతో.. మ‌ళ్లీ త‌మిళ రాజ‌కీయాల్లో అల‌జ‌డి మొద‌లైంది. జ‌య‌ల‌లిత‌-ఎంజీఆర్‌ల బంధానికి ప్ర‌తీకగా వారికి కూతురు పుట్టింద‌ని, చిన్న‌త‌నంలోనే జ‌య నెచ్చెలి శశిక‌ళ వ‌ల్ల దూరమైపోయాన‌ని చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త‌మిళ […]

త‌మిళ‌నాట రాష్ట్ర‌ప‌తి పాల‌నేనా?!

త‌మిళ‌నాడులో రాష్ట్ర‌ప‌తి పాల‌న త‌ప్ప‌దా? ఆదిశ‌గా కేంద్ర‌మే పావులు క‌దుపుతోందా? ప్ర‌స్తుతం ఏర్పాటైన ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున మంత్రాంగం న‌డుస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. వారం కింద‌టి వ‌ర‌కు తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడిన త‌మిళ‌నాడు రాజ‌కీయాలు చిన్న‌మ్మ జైలుకు వెళ్ల‌డం, ప‌ళ‌ని సీఎం సీటెక్క‌డంతో అంతా స‌ర్దుకుంటాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, అసెంబ్లీలో ప‌ళ‌ని బ‌ల‌ప‌రీక్ష సంద‌ర్భంగా జ‌రిగిన కురుక్షేత్ర ప‌ర్వం.. తాజాగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను అట్టుడికిస్తోంది. అసెంబ్లీ బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌ని […]

చిన్న‌మ్మకు ఊహించ‌ని షాకిచ్చిన ప‌ళ‌ని

న‌మ్మిన బంటును సీఎం పీఠంపై ఉంచి.. జైలు నుంచే త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావించిన శ‌శిక‌ళ‌కు షాక్ త‌గిలింది. త‌న మాటే శాసనంగా ప‌నిచేస్తార‌ని భావించిన వ్య‌క్తి.. ఆమెకు దిమ్మతిరిగి పోయాలా చేశారు. `నేను రిమోట్ ద్వారా ప‌నిచేసే ముఖ్య‌మంత్రిని కాదు` అంటూ.. చిన్న‌మ్మ‌కు హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు పళ‌నిస్వామి! ఏ రాజ‌కీయ అనుభ‌వం లేని శ‌శికళ మాట త‌నెందుకు వినాలని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శ‌గా తాను చెప్పిన వ్య‌క్తిని నియ‌మించాల‌ని శ‌శిక‌ళ పంపిన ఆదేశాలు..పాటించ‌న‌ని స్ప‌ష్టంచేశారు. పాల‌న‌తో […]

అన్నాడీఎంకేలో మూడు కుంప‌ట్లు

త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆసక్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయా?  అధినేత్రి అమ్మ మ‌ర‌ణంతో పార్టీలో అధికారమే కేంద్రంగా విచిత్ర వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుందా?  జ‌య‌కు అనుచ‌రులుగా ఉన్న ముగ్గురు వ్య‌క్తులు ప్ర‌ధానంగా పార్టీలో చ‌క్రం తిప్ప‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. త‌మిళ‌నాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జ‌య మ‌ర‌ణంతో రాష్ట్ర అధికార పార్టీని ఎవ‌రు లీడ్ చేస్తార‌నే ప్ర‌శ్న సాధార‌ణంగా ఉద‌యించేదే. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకేలో పెద్ద ఎత్తున ఈ విష‌యంపై చ‌ర్చ జ‌రిగింది. జ‌య […]