త‌న‌కు తానే బుక్ అయిన చంద్ర‌బాబు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాల విష‌యంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని న‌మ్ముకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిపై అటు విప‌క్షాలు, ఇటు అధికారుల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోకుండా ముందుకే వెళ్లింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఆయ‌న మంత్రి వ‌ర్గం మీడియా స‌హా ప్ర‌తి ఒక్క‌రిపైనా ఎద‌రు దాడినే కొన‌సాగించారు. స్విస్ ఛాలెంజ్ ప్ర‌క్రియ‌ను అద్భుతంగా కొనియాడారు. మ‌న‌దేశంలో ఇంతటి సామ‌ర్ధ్యం, నైపుణ్యం ఉన్న సంస్థ‌లు, వ్య‌క్తులు లేవ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఎట్టిప‌రిస్థితిలోనూ స్విస్ ఛాలెంజ్‌లోనే రాజ‌ధాని […]

అమ‌రావ‌తిలో నాలుగేళ్ల ఖ‌ర్చు చూస్తే షాకే

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం వ‌చ్చే నాలుగేళ్ల‌లో ఖ‌ర్చు చేయాల‌ని భావిస్తున్న డ‌బ్బెంతో తెలిస్తే.. షాకే! ఒక వెయ్యి కోట్లు కాదు ప‌ది వేల కొట్లు కాదు ఏకంగా 32 వేల కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్రపంచ‌స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌య్యాయి. ముఖ్యంగా ఏ ప‌ని సాకారం కావాల‌న్నా డ‌బ్బుతోనే ప‌ని. అలాంటిది ఏమీలేని చోట అంత‌ర్జాతీయ స్థాయి […]

తెలుగు న్యూస్ ఛానెల్స్ రూటు మార‌నుందా

ఎవ‌రు కాద‌న్నా, అవున‌న్నా…   ప్ర‌స్తుతం న‌డుస్తున్నరాజ‌కీయాల్లో ప్ర‌సార మాధ్య‌మాలు పోషిస్తున్న పాత్ర‌ను త‌క్కువ చేసి చూడ‌లేం. అధికారంలో ఉన్న పార్టీలు త‌మ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నా, విప‌క్షాలు చేసే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌పోరాటాలు విజ‌య‌వంతం కావాల‌న్నామీడియా స‌హ‌కారం అత్య‌వ‌స‌రంగా మారిపోయిందిప్పుడు. ఇప్ప‌టికీ ప‌త్రిక‌ల హ‌వా త‌గ్గ‌కున్నా… ప్రజల మీద ప్రభావం చూపించే మీడియా మాధ్యమాల్లో టీవీ ఛాన‌ళ్లు మ‌రింత‌ కీలకంగా మారిపోయిన సంగ‌తి కూడా గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి  చెందుతున్నా అది విద్యావంతుల‌కు మాత్ర‌మే […]

స్విస్ ఛాలెంజ్ నుంచి బాబు బ‌య‌ట‌ప‌డే య‌త్నం

ఏపీ ప్ర‌భుత్వాన్ని, సీఎం చంద్ర‌బాబును ఇర‌కాటంలోకి నెట్టిన స్విస్ ఛాలెంజ్ విష‌యంలో బ‌య‌ట‌ప‌డేందుకు బాబు ప్రయ‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం కోర్టులో దీనిపై కేసు న‌డుస్తుండ‌గానే ఈ టెండ‌ర్ విధానానికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంగ‌ళ‌వారం జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించి ఆమోదించాల‌ని చూస్తున్నారు. అయితే, ఒక ప‌క్క కోర్టులో కేసు న‌డుస్తుండ‌గానే.. దీనికి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను మార్చ‌డం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌స‌మ్మ‌తం అనే ప్ర‌శ్న ఉత్పన్న‌మ‌వుతోంది. దీనికి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది […]

ఇలా అయితే బాబుకు సీఎం పోస్టు క‌ష్ట‌మే..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఫ్యూచ‌ర్‌పై ఆశ‌లు అంత‌గా నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు! ఏపీలో రానున్న రెండు ట‌ర్మ్‌ల వ‌ర‌కు టీడీపీనే అధికారంలో ఉండాల‌ని, తానే సీఎంగా పాలించాల‌ని చంద్ర‌బాబు ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌నే క‌సితో ఉన్న బాబు.. దానికి త‌గిన‌ట్టుగా పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం, త‌న పాల‌న‌కు మెరుగులు పెట్టుకోవ‌డం, నిరంతరం ప్ర‌జ‌ల్లో ఉండేలా ఏవో ఒక కార్య‌క్ర‌మాలు రూపొందించుకోవ‌డం జ‌రుగుతున్నాయి. […]

కాపు కార్డుతో మంత్రి ప‌ద‌వికి గాలం

ఏపీలో కాపు ఉద్య‌మం సీఎం చంద్ర‌బాబుతో పాటు అధికార టీడీపీని చాలా ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఎప్పుడైతే కాపు ఉద్య‌మం స్టార్ట్ చేశాడో అధికార టీడీపీలో ఉన్న కాపుల ప‌రిస్థితి ముందు నుయ్యి ..వెన‌క గొయ్యిలా మారింది. పార్టీ గీసిన గీత దాటి ముందుకు వెళ్ల‌నూ లేరు..అలాగ‌ని కాపుల కోసం ఏం మాట్లాడ‌కుండా ఉండ‌నూ లేరు అన్న చందంగా వీరి ప‌రిస్థితి మారింది. ఈ టైంలో దాదాపు అంద‌రూ టీడీపీ కాపు ప్ర‌జాప్ర‌తినిధులు గోడమీద […]

అమ‌రావ‌తి మేయ‌ర్ కోసం టీడీపీలో ఫైటింగ్‌

ఏపీ రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లా కేంద్ర‌మైన గుంటూరు న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల వేడి అప్పుడే రాజుకుంది. ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా ఖాళీగా ఉన్న 7 కార్పొరేష‌న్ల‌తో పాటు 4 మునిసిపాలిటీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌చ్చే న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యింది. ఈ మేర‌కు కోర్టులో కొన్ని మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల విష‌యంలో ఉన్న అభ్యంత‌రాల‌ను తొల‌గించుకోనుంది.  చంద్ర‌బాబు సైతం ఈ 11 చోట్ల ఎన్నిక‌లు జ‌రిగాకే ఈ ఎన్నిక‌ల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల […]

బాబు ఈ డ‌బ్బులు ఏ మూల‌కు ..?

ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. పోల‌వ‌రానికి కేంద్రం ఇబ్బడి ముబ్బ‌డిగా నిధులు ఇస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇప్పుడు ఇచ్చింది తీసుకుంటామ‌ని, రావాల్సిన‌వి అడుగుతామ‌ని ఆయ‌న పేర్కొటూ.. ప్యాకేజీకి రెడ్ కార్పెట్ ప‌రిచారు. అయితే, ఈ ప్యాకేజీలోగుట్టు స్టోరీ ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతోంది. తాజాగా వ‌స్తున్న మీడియా క‌థ‌నాల ప్ర‌కారం కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీ ఏపీకి ఏమూల‌కూ స‌రిపోద‌నే కాకుండా.. ప్యాకేజీ పేరుతో కేంద్రం పెద్ద కుచ్చుటోపీనే పెట్టింద‌ని స‌మాచారం. నిధులు […]

ఏపీకి ఆ సాయం కూడా రాకుండా కేంద్రం బ్రేక్‌.

విభ‌జ‌న పాపంలో పార్ల‌మెంట్ సాక్షిగా.. నాడు అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ పార్టీతో పోటీప‌డి మ‌రీ బీజేపీ పాలు పంచుకున్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లు ఇంకా మ‌ర‌చిపోలేదు. అయితే తాము అధికారంలోకి వ‌చ్చాక  విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకుంటామ‌ని చెప్పిన‌ బీజేపీ నేత‌ల హామీల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఫ‌లితంగానే ఏపీలో బ‌ల‌మైన పునాదులు ఉన్న కాంగ్ర‌స్ పార్టీని చ‌రిత్ర‌లో గుర్తుండిపోయే స్థాయిలో భూస్థాపితం చేసి మ‌రీ టీడీపీ, బీజేపీ కూట‌మికి అధికారం అప్ప‌గించారు.. అయితే  అధికారం చేజిక్కాక, […]