అమరావతిని అడ్డుకోవద్దు: సుప్రీంకోర్టు

కొత్త రాష్ట్రం రాజధానిని నిర్మించుకోవద్దా? అని సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎబికె ప్రసాద్‌ని ప్రశ్నించింది. అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును కొట్టివేసిన న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్లో, అనేక కీలకాంశాలు ఉన్నాయి. రాజధానిని ఎక్కడ నిర్మించాలో మీరే చెబుతారా? మీరేమైనా రైతా? అని ప్రశ్నించడంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి నోట మాట రాలేదు. రైతులు నష్టపోతున్నారని ఆయన చెప్పినప్పుడు, రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు […]

పుష్కరం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకం

పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాలు ఎంతో ప్రత్యేకమైనవి. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏడాది తిరిగింది, ఈసారి కృష్ణా పుష్కరాలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేశాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు జరగనుండగా, ముందే పుష్కర వైభవం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రత్యేకం ఈ కృష్ణా పుష్కరాలు. ఎందుకంటే, పుష్కరాలు జరిగే ప్రధానమైన రెండు జిల్లాల […]

లండ‌న్ కోర్టు, సింగ‌పూరోడు:చంద్ర మాయ

ఏపీ రాజ‌ధాని నిర్మాణ వ్యవ‌హారాన్ని స్విస్ చాలెంజ్ ప‌ద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వం సింగ‌పూర్ క‌న్సార్టియానికి క‌ట్టబెట్టింది. అదే సంద‌ర్బంలో న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందుల‌న్నీ లండ‌న్ కోర్టులో తేల్చుకోవాల‌ని ఒప్పందం చేసుకుంది. అంటే భ‌విష్యత్తుల్లో సింగ‌పూర్ క‌న్సార్టియం లాభాల‌కు గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వం ఒక‌వేళ ప‌రిస్థితులు తార‌మార‌యితే మాత్రం లండ‌న్ కోర్టు బోనెక్కాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం అంటే మ‌నంద‌రి ప‌రిస్థితి దోషులుగా నిల‌వాల్సి ఉంటుంది. సింగ‌పూర్ కంపెనీల లాభాల కోసం మ‌న రాజ‌ధాని క‌డుతున్న చందంగా ప‌రిస్థితులు మార్చేసిన […]

రాజకోట(అమరావతి) రహస్యం తెలుసా?

రాజధాని నిర్మాణం రాజకోట రహస్యంగా మారిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిర్మాణం కోసం సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలు ఇతర నిర్మాణ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనల్లో సరైన వివరాలు లేకపోవడంతో దానిని ఛాలెంజ్‌ చేయాలని భావిస్తున్న ఇతర నిర్మాణ సంస్థలు ఆయోమయంలో పడుతున్నాయి. కీలక వివరాలు ఉండాల్సిన చోట చుక్కలు (డాట్స్‌) మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఆర్థిక అంశాలకు సంబందించిన ముఖ్యమైన వివరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సింగపూర్‌ సంస్థలకే నిర్మాణ పనులను […]

షాక్ ఇస్తున్న అమరావతి ఇటుకలు!

అమరావతి అని రాజధాని పేరును ప్రకటించిన దగ్గరినుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తో ఊడగొట్టేసింది.అమరావతి పేరులోనే రాజసం ఉట్టిపడుతోంది.అమరావతి అంటే ప్రజలది..ప్రజలంటేనే అమరావతే అన్నంతగా ప్రచారాన్ని హోరెత్తించారు.అసలు శంకుస్థాపనయితే ఓ చారిత్రాత్మక ఘట్టంలా నిర్వహించారు.దాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ ఓ వైపు లోటు బడ్జెట్ సన్నాయి నొక్కులు నొక్కుతూనే మరో వైపు శంకుస్థాపన ఆర్భాటాలు చూసి జనం విస్తుపోయారు. మొదట్లో స్వచ్ఛందంగానే ప్రజలంతా మన అమరావతి అనే నినాదం తోనే ముందుకెళ్లారు.అప్పట్లో ఆహా అమరావతి […]

చంద్రన్నా ఏంది నీ తొందర

ఆంధ్రప్రదేశ్‌ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం. ఆర్థిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్‌ సతమతమవుతోంది. రాజధాని నిర్మించుకోవడం ఆంధ్రప్రదేశ్‌ ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ అది శక్తికి మించిన పని. అయినా తప్పదు, రాజధానిని నిర్మించుకోవాల్సిందే. ఇంకో వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నేను నిద్రాహారాలు మాని కష్టపడుతున్న అని ఎంత మొత్తుకున్నా ఏ పనీ సకాలంలో పూర్తి కావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కి అపారమైన వనరులన్నాయి, అలాగే అపాయాలు కూడా ఉన్నాయి. ప్రకృతే ఆంధ్రప్రదేశ్‌కి బలం, బలహీనత. సముద్ర తీరం ఎంత అందమైనదో, […]

చంద్రబాబు వరల్డ్ టూర్:రష్యా వంతొచ్చింది

చంద్రబాబు చైనా పర్యటనకెళ్ళాడు.అక్కడి విశేషాలను ఇక్కడి ఆస్థాన పత్రికలు, మీడియా మొత్తం ఎప్పటికప్పు Flash న్యూస్ రూపం లో యే రోజు ఎన్నెన్ని పెట్టుబడులు బాబుగారు తెచ్చేస్తున్నారో సవివరంగా వండి వార్చేసారు.మొత్తానికి ఓ 58 వేల కోట్ల పెట్టుబడులు చైనా నుండి అమరావతికి తరలి రానున్నాయట.మొన్నామధ్య విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏకంగా 4 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు రానున్నట్టు ఊదరగొట్టేసారు.అయితే ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు.మరి ఈ […]

జగన్‌ కూడా ఛలో విజయవాడ 

ఆంధ్రప్రదేశ్‌ ఇక నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలించబడనుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు పరిపాలనా కేంద్రాలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకి తరలించడం జరిగింది. విజయవాడలోనూ ఆ పార్టీ ముఖ్య కార్యాలయం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగా తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా విజయవాడలో కార్యాలయం ఉన్నా, అధినేత వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి […]

స్విస్‌ ఛాలెంజ్‌: కేంద్రానికి ఇష్టంలేదా? 

అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్‌ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్‌. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]