Tag Archives: amit shah

బీజేపీకి ఆప్త‌మిత్రుడి గుడ్ బై.. ర‌స‌కందాయంలో క‌మ‌ల‌నాథులు

BJP-JDU Allaince

బీజేపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. బిహార్‌లో చ‌క్రం తిప్పాలని త‌ద్వారా ఆర్డేజీ, కాంగ్రెస్‌కు గ‌ట్టి దెబ్బ‌కొట్టాల‌ని భావించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీ సార‌థి అమిత్ షాల‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. తాము ఎంతో న‌మ్మిన బిహార్ సీఎం నితీష్ కుమార్ వార్నింగ్ ఇచ్చేశారు. గ‌త 2015లో బిహార్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఆర్జేడీ, కాంగ్రెస్‌, జేడీయూ కూట‌మి గెలుపొందింది. అయితే, ఇక్క‌డ పాగా వేయాల‌ని భావించిన న‌రేంద్ర మోడీ.. ఏడాదిన్న‌ర తిర‌గ‌కుండానే అర్ధంత‌రంగా జేడీయూతో

Read more

అమిత్‌షా.. అత్యాశ యాత్ర‌..!

amit shah

ఆరు రాష్ట్రాలు.. 120 స్థానాలు.. ఇదీ వ‌చ్చే లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో  బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా టార్గెట్‌..!  ఈ టార్గెట్‌ను చేరుకునేందుకు ఆయ‌న ఈనెల 7న ప‌ర్య‌ట‌న ప్రారంభించారు.. అమిత్‌షా మూడు నెల‌ల‌పాటు తీవ్ర క‌స‌ర‌త్తు చేసి ఎన్నిక‌ల్లో విజ‌యానికి రూట్‌మ్యాప్ రూపొందించిన‌ట్లు తెలిసింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా సుమారు ప‌దినెల‌ల స‌మ‌యం ఉండ‌గానే..క‌మ‌ల‌ద‌ళం క‌స‌ర‌త్తు చూస్తుంటే  ఎంత‌ప‌ట్టుద‌ల‌గా ముందుకు వ‌స్తుందో అర్థ‌మ‌వుతుంది. కానీ.. ద‌క్షిణాది నాలుగు రాష్ట్రాల‌తోపాటు ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్‌లో అమిత్‌షా ప‌ర్య‌ట‌న కొన‌సాగనుంది.

Read more

వాడిపోతున్న క‌మ‌లం..ఎన్డీయేలో భారీ సంక్షోభ‌మే

modi-amit shah

దేశ‌వ్యాప్తంగా బీజేపీయేత‌ర పక్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్న వేళ‌.. ఎన్డీయే కూట‌మిలో ముస‌లం మొద‌లైంది.  ప్ర‌ధాని మోడీపై కొన్ని మిత్ర‌ప‌క్షాలు గుర్రుగా ఉంటే.. మ‌రికొన్ని బ‌య‌ట‌కొచ్చి క‌ర్రుకాల్చి వాత‌పెడుతున్నాయి. ప్ర‌స్తుత‌మున్న మిత్ర‌ప‌క్షాలు కూడా ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌ప‌డుదామా.. అని చూస్తున్నాయి. మోడీ- అమిత్‌షా ద్వ‌యంతో వేగ‌లేం బాబోయ్ అంటూ కుమిలిపోతున్నాయి. ఈ క్ర‌మంలో ఎప్పుడైనా.. ఏ క్ష‌ణ‌మైనా కూట‌మి నుంచి త‌ప్పుకునేందుకు గ్రౌండ్‌వ‌ర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహం చేసిందంటూ చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఎన్డీయే

Read more

బాబును సైలెంట్‌గా ఇరికించేసిన బీజేపీ

babu-bjp

మేం బీజేపీ దెబ్బ‌తీస్తాం.. ఆ పార్టీకి, ఆ పార్టీ నేత‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తాం!! అని  ఖ‌చ్చితంగా ఓ నెల రోజుల కింద‌ట నుంచి ఏపీ సీఎం చంద్ర‌బాబు చెబుతూ వ‌స్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ కూడా మొద‌లైంది. అప‌ర చాణిక్యుడు వంటి బాబుతో పెట్టుకున్న బీజేపీ.. ఇక మ‌టాషే! అని అంద‌రూ అనుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు ఏ వేదిక ఎక్కినా… బీజేపీకి బుద్ధి చెప్పాలంటూ ప్ర‌జ‌ల‌కు సుద్దులు చెబుతున్నారు. బీజేపీ

Read more

బాబుకు మరో ఝలక్ .. రాష్ట్రంపై మరోభారం నెట్టిసిన కేంద్రం

babu-modi

అస‌లే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతున్న రాష్ట్రం.. అందులోనూ లోటు బ‌డ్జెట్‌తో ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టిన రాష్ట్రానికి కేంద్రం బాస‌ట‌గా నిల‌వాల్సి ఉన్నా.. కేంద్రం ఆ దిశ‌గా చ‌ర్య‌లేమీ మొద‌లుపెట్ట‌లేదనే విమ‌ర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం కేంద్ర, రాష్ట్రాల మ‌ధ్య స‌ఖ్య‌త కూడా లేక‌పోవ‌డం ఇందుకు ప్రధాన కార‌ణ‌మ‌నే సమాధానాలు లేక‌పోలేదు. ఇదే స‌మ‌యంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. ఏపీని మ‌రింత అప్పుల పాలు చేసేస్తున్నాయి. అంతేగాక ఆర్థికంగా కోలుకోనివ్వ‌కుండా చేస్తున్నాయ‌ని ఆర్థిక నిపుణులు గ‌గ్గోలు పెడుతున్నారు. కేంద్రం

Read more

ఐదేళ్లే భ‌రించ‌లేక‌పోయాం.. 50 ఏళ్లు ఏల..షా!!

amit shah

రాజ‌కీయాల్లో అధికారం ప్ర‌ధానం. అధికారం కోరుకోని పార్టీ, నాయ‌కుడు ఉండ‌రంటే అతిశ‌యోక్తి అనిపించ‌క మాన‌దు. ఇక‌, అధికారంలో ఉన్నవారు మ‌రింతగా మ‌రిన్ని అడుగులు ముందుకు వేసి.. మ‌రిన్ని సంవ‌త్సారాలు అధికారంలో ఉండాల‌ని కోరుకోవ‌డం, అధికార పీఠాన్ని త‌మ‌కే సొంత సొత్తుగా భావించ‌డం కామ‌న్ అయిపోయింది. ఏపీలో సీఎం చంద్ర‌బాబు ఏకంగా ఒక‌టి కాదు రెండు ప‌ర్యాయాలు కాదు.. మ‌రో 6 ప‌ర్యాయాలు(అంటే 30 ఏళ్లు) త‌మ‌కే అధికారం క‌ట్ట బెట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. త‌మ వ‌ల్లే రాష్ట్రం

Read more

కాంగ్రెస్‌కు స్టార్ ప్ర‌చార‌క‌ర్త‌గా మారిన అమిత్‌షా

amit shah-karnataka

దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్‌, రెండోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న బీజేపీ హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న‌క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి స్టార్ ప్ర‌చార‌క‌ర్త‌గా మారిపోయారు. ఆయ‌న చేస్తున్న చేస్తున్న పొర‌పాట్లు కాంగ్రెస్‌కు చ‌ప్ప‌ట్లు కొట్టేలా మారుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌ర్య‌టిస్తున్న క్ర‌మంలో అమిత్‌షా చేసిన వ్యాఖ్య‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు తెగ సంబుర‌ప‌డిపోతున్నారు.    అమిత్ షా

Read more

‘ గాలి ‘ తిరుగుబావుటా…. క‌మ‌లానికి క‌ష్టాలు

bjp-gaali

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో క‌మ‌ల‌ద‌ళాన్ని  క‌ష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక‌దాని త‌ర్వ‌తా ఒక‌టి నిరంత‌రం ఏదో ఒక కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డుతోంది. ఎన్నిక‌ల న‌గారా మోగిన నాటి నుంచి మొద‌లు బీజేపీకి అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు. ఎన్నిక‌ల సంఘానికంటే ముందే ఆ పార్టీ జాతీయ ఐటీ విభాగం బాధ్యుడు ఎన్నిక‌ల తేదీలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం.. యడ్యూర‌ప్ప ప్ర‌భుత్వం అవినీతిమ‌యం అంటూ సొంత‌పార్టీ సీఎం అభ్య‌ర్థిపైనే పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా నోరుజార‌డం.. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి విష‌యంలో

Read more

బీజేపీని ఏకాకి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా బాబు కొత్త వ్యూహం

bjp-chandrababu

కేంద్రంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతున్న‌ది తామేననే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయ‌త్నిస్తున్నారు. అంతేగాక ఇత‌ర రాజ‌కీయ పార్టీలు కూడా త‌మ‌కే మ‌ద్ద‌తు తెలిపేలా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతున్న పార్టీకి, త‌న‌ను బ‌ల‌ప‌ర‌చాల్సిందేనని ప‌దేప‌దే డిమాండ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీతో వైసీపీ ర‌హ‌స్యంగా పొత్తు పెట్టుకుని, ఏపీపై కుట్ర చేస్తున్నార‌ని బాబు విమ‌ర్శిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పీఎంవో ద‌గ్గ‌ర

Read more

Share
Share