Tag Archives: Ananthapur

అధికార పార్టీకి ఆఫీస్ క‌రువు.. జోక్ కాదు.. నిజ‌మే

TDP, Party Office, Ananthapur, Andhra Pradesh

ఏంటి.. అధికారంలో ఉన్న పార్టీకి ఆఫీస్ కూడా లేదంటే న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేదా?  కానీ, ఇది ప‌చ్చి నిజం! అది కూడా ఎక్క‌డో కాదు, మ‌న రాష్ట్రం ఏపీలోనే!! గ‌తంలో తొమ్మిదేళ్లు, ప్ర‌స్తుతం నాలుగేళ్లు పాల‌న పూర్తి చేసుకుంటున్న టీడీపీకి ఏపీలోని ఓ జిల్లాలో సొంత పార్టీ కార్యాల‌య‌మే క‌రువైంది. అది కూడా ఆ జిల్లాలో టీడీపీకి అత్యంత బ‌లం ఉండ‌డం మ‌రింత విస్తుపోయే విష‌యం. కార్యాల‌యం నిర్మించాల‌ని ఏ ఒక్క‌రూ పూనుకో క‌పోవ‌డం మ‌రింత విడ్డూరం.

Read more

వైసీపీలో వ‌ర్గ పోరు.. జ‌గ‌న్ కు తిప్ప‌లే!

ys jagan - urvakonda-TJ

అనంత‌పురం జిల్లాలో మిగిలిన ఒకే ఒక్క వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర రెడ్డి చుట్టూ వివాదాలు న‌డుస్తున్నాయి. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన విశ్వేశ్వ‌ర‌రెడ్డి అధికార పార్టీ నుంచి ఆహ్వానాలు అందినా జ‌గ‌న్ వెంటే న‌డుస్తున్నారు. జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడుగా కూడా మెలుగుతున్నారు. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ పోరు తార‌స్థాయికి చేరింది. ఈ సీటును ఆశిస్తున్న ఒక‌రిద్ద‌రు ఉర‌వ‌కొండ‌లో వైసీపీని రెండుగా చీల్చే ప్ర‌యత్నం చేస్తున్నారు. ఉరవకొండ నుంచి గత ఎన్నికల్లో విశ్వేశ్వర్

Read more

అనంత టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆ ఐదుగురు ఔట్.. !

Anantapur

అధికార టీడీపీకి అంత్యంత ప‌ట్టున్న జిల్లా అయిన అనంత‌పురంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరు నానాటికీ తీసిక‌ట్టుగా ఉందా?  సీఎం చంద్ర‌బాబు స‌ర్వేలో స‌ద‌రు ఎమ్మెల్యేల ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ట్టు తేలిందా?  దీంతో ఇక‌, వారిని ఉపేక్షించేది లేద‌ని నిర్ణ‌యించుకున్నారా? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి. అనంత‌పురం జిల్లాలో గ‌త ఎన్నికల్లో మొత్తం 14 సీట్ల‌కు టీడీపీ 12 సీట్లు గెలుచుకుంది. ఆ త‌ర్వాత క‌దిరి ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోవ‌డంతో ఇప్పుడు జిల్లాలో

Read more

ప‌య్యావుల సాక్షిగా టీడీపీలో ముస‌లం

Payyavula keshav, sujatha, TDP, Politics, Ananthapur, uravakonda

టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌కు చెందిన ప‌య్యావుల కేశ‌వ్ చుట్టూ రాజ‌కీయ విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. స్థానికంగా ప‌య్యావుల కొంద‌రినే క‌లుపుకొని వెళ్తున్నార‌ని, ఫ‌లితంగా మ‌రికొంద‌రు స్థానిక‌ కీల‌క నేత‌ల‌కు గుర్తింపు ల‌భించ‌కుండా పోతోంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు పార్టీకి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ఉర‌వ‌కొండ పంచాయ‌తీలో టీడీపీకి మంచి బ‌లం ఉంది. ఇక్క‌డ స‌ర్పంచ్‌గా ఉన్న న‌ర్రా సుజాత కుటుంబం ఎప్ప‌టి నుంచో

Read more

వైసీపీలో గోల గోల‌…జ‌గ‌న్‌పై తీవ్ర ఒత్తిడి

ysrcp-durgam-TJ

ఏపీలో టీడీపీ కంచుకోట‌గా ఉన్న అనంత‌పురం జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో వైసీపీకి కాస్తో కూస్తో ఊపు వ‌చ్చింది. జ‌గ‌న్ పార్టీకి ఊపు తెస్తున్నా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో మాత్రం పార్టీకి త‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీని ముందుండి న‌డిపించే నాయ‌కుడు క‌న‌ప‌డడం లేదు. ముందుగా స్థానిక నాయ‌కులు ఎవ్వ‌రూ ఇక్క‌డ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో స్థానికేత‌రురాలైన ఉషాశ్రీ చ‌ర‌ణ్‌కు ప‌గ్గాలు ఇచ్చారు. ఆమె స్థానికేత‌రురాలు కావ‌డంతో

Read more

ప‌వ‌న్ నియోజ‌క‌వ‌ర్గంపై జ‌గ‌న్ గురి

pawan-jagan-TJ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పొలిటిక‌ల్ ర‌ణ‌క్షేత్రంలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా ? అని ఏపీ జ‌నాలందరూ ఓ వైపు ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఇటు వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు రెడీ అవుతున్నాడు. ప‌వ‌న్ ఇప్ప‌టికే తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లాలోని ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ అనంత‌పురంలో పోటీ చేస్తాన‌న్న ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే ప‌వ‌న్

Read more

జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన టీడీపీ జిల్లా!

ys jagan-ananthapur-TJ

వైసీపీ అధినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం టీడీపీ జిల్లాగా పేరొందిన సీమ‌లోని అనంత‌పురం జిల్లా మొత్తం ఒక్క‌సారిగా క‌దిలింది. పార్టీల‌తో సంబంధం లేకుండా జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది. జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని వాడ‌వాడ‌లా జ‌నం.. జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణ చేయడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెప్పేందుకు ఎగ‌బ‌డ్డారు. జగ‌న‌న్న‌కు శుభాకాంక్ష‌లు అంటూ సోష‌ల్ మీడియాలోనూ హోరెత్తించారు. నిజానికి టీడీపీ ప‌ట్టున్న అనంత‌పురంలో జ‌గ‌న్ గురించి పెద్ద‌గా

Read more

బాల‌య్యను ఓడిస్తా.. వైసీపీ నేత అర‌గుండు స‌వాల్!

1426417684_nara-chandrababu-naidu-balakrishna

2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం పైగా ఉంది. అయితే, విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే అప్ప‌టి ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌తో నేరుగా క‌లిసేందుకు, వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర కూడా చేస్తున్నారు. న‌డుం నొప్పిగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న వెనుతిర‌గ‌డం లేదు, కోర్టు నుంచి స‌హ‌కారం లేక‌పోయినా మ‌డ‌మ తిప్ప‌డం లేదు. చంద్ర‌బాబు ప్ర‌బుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డుతూ పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికి 40 రోజులు కూడా పూర్తి చేసుకుని

Read more

జేసీ దివాక‌ర్‌రెడ్డిపై టీడీపీ లేడీ మేయ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

JC Diwakar reddy, Ananthapur, TDP, Meyer, comments

మాట‌ల తూటాలు పేల్చే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిపై అదే రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు అనంతపురం మ‌హిళా మేయ‌ర్ స్వ‌రూప‌. కొంత కాలంగా జేసీ వైఖ‌రిపై చాలా ఆగ్ర‌హంగా ఉన్న ఆమె బుధ‌వారం క‌ట్ట‌లు తెంచుకున్న కోపాన్ని ఒక్క‌సారిగా వెళ్ల‌గ‌క్కేసింది. జేసీపై ఈ రేంజ్‌లో విరుచుకుప‌డిన సొంత పార్టీ నేత ఈమే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త కొన్నాళ్లుగా జిల్లా టీడీపీలో వ‌ర్గ పోరు జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అభివృద్ధి విష‌యంలో జేసీ చేస్తున్న కామెంట్లు స్థానికంగా ఉంటున్న

Read more