చంద్రబాబు కొత్త బాధ్యతలు ట్రయిలర్‌… ఉక్కిరిబిక్కిరి లో కొత్త మంత్రులు

అన్న ప్రాస‌న రోజే ఆవ‌కాయ అనే నానుడి ఎంతో సుప‌రిచితం!!  ఇప్పుడు ఏపీలో కొత్త కేబినెట్లో మంత్రులు కూడా దీనిని గుర్తుచేసుకుని బోరుమంటున్నారు. ఎన్నో రోజులు ఊరించి ఊరించిన సీఎం చంద్ర‌బాబు.. ఆఖ‌రుకి తన క్యాబినెట్‌ను ప్ర‌క‌టించారు. ఇందులో పాత‌, కొత్తవారితో క‌లిపి మొత్తం 25 మంది ఉన్నారు. దీంతో కొత్తగా ప‌ద‌వి పొందిన వారి ఆనందానికి అవ‌ధుల్లేవు. అలాగే త‌మ ప‌ద‌వి ప‌దిలమైనందుకు కొంత‌మంది సంబ‌ర‌ప‌డ్డారు. కానీ ఆ ఆనందం, సంబ‌రం కొద్ది గంటల్లోనే ఆవిరి […]

ఏపీ మునిసిప‌ల్స్ ఉప పోరులో సైకిల్ జోరు – ఫ్యాన్ బేజారు

ఏపీలో వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డుల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ స‌త్తా చాటింది. టీడీపీ జోరుకు విప‌క్ష వైసీపీ బేజార‌య్యింది. కీల‌క జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖ‌ప‌ట్నంలోని వివిధ మునిసిపాలిటీల్లో ప‌లు వార్డుల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెలువ‌డ్డాయి. ఒక్క వార్డులో మిన‌హా మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీ దూకుడు ముందు వైసీపీ చేతులెత్తేసింది. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు […]

కుప్పం బ‌రిలో లోకేశ్ – గుడివాడ నుంచి చంద్ర‌బాబు

ఏపీలో కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ఏప్రిల్ 2 ముహూర్తంగా ఖ‌రారైంది. దీంతో లోకేశ్ ఎప్పుడెప్పుడు మంత్రి అవుతారా ? అని ఎంతో ఉత్కంఠ‌గా వెయిట్ చూస్తోన్న వారి నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. లోకేశ్‌కే ఏయేశాఖ‌లు ద‌క్కుతాయా ? అన్న‌ది ఒక్క‌టి మాత్ర‌మే మిగిలిఉంది. ఇదిలా ఉంటే లోకేశ్ మంత్రిగా మ‌రో రెండేళ్లు మాత్ర‌మే ఉంటారు. ఇంకా చెప్పాలంటే యేడాదిన్న‌ర టైం మాత్ర‌మే వాళ్ల‌కు ఫ్రీగా ఉంటుంది. చివ‌రి ఆరు నెల‌లు మ‌ళ్లీ ఎన్నిక‌ల మూడ్‌కు రెడీ అవ్వాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం […]

ఏపీ క్యాబినెట్‌లో ఇన్ అండ్ అవుట్ వీళ్లే

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. కొత్తగా చేరికలు, కొందరి ‘తీసివేతలు’, మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏప్రిల్‌ 2వ తేదీనే దీనికి ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏవైనా కారణాలవల్ల 2వ తేదీ కుదరకపోతే… 6న కేబినెట్‌ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. కాగా కొత్త‌గా మంత్రివర్గంలోకి 8 నుంచి 10 కొత్త ముఖాలు వచ్చే అవ‌కాశ‌ముంద‌నే ప్ర‌చారం అంత‌ర్గ‌తంగా జ‌రుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరినైనా తొలగిస్తే వారి స్థానంలో ఆయా జిల్లాలు, […]

టీడీపీలో సీనియర్లపై బాబుకు నమ్మకం లేదా..!

ఒక‌ప్పుడు తెలుగుదేశం అంటే న‌మ్మ‌కానికి, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు..త‌ర్వాత చంద్ర‌బాబు సీఎం అయిన‌ప్పుడు టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ నూటికి నూరుశాతం ఉండేది. పార్టీ నిర్ణ‌యాన్ని ఎవ్వ‌రూ వ్య‌తిరేకించే వారు కాదు. అధ‌ధినేత చెప్పిందే వేదం. అయితే ఇప్పుడు తెలుగుదేశం సీన్ మారింది. క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా గాడి త‌ప్పేసింది. పార్టీలోనే ఒక‌రికి ఒక‌రికి ప‌డ‌డం లేదు. జిల్లాల్లో కాదు ఇంకా చెప్పాలంటే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే గ్రూపు రాజ‌కీయాలు ఓ రేంజ్‌లో రాజ్య‌మేలుతున్నాయి. ఇక ఇప్పుడు పార్టీలో చంద్ర‌బాబునే […]

ఏపీలో బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫ్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ?

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీలో బీజేపీ విజ‌యం ఆ పార్టీకి ఎక్క‌డ లేని జోష్ ఇచ్చింది. గ‌తంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిప‌డిన బీజేపీ ఇప్పుడు ఇత‌ర పార్టీల స‌హ‌కారం లేకుండానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవ‌స‌రం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్ర‌యోగించాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నార‌ట‌. […]

టీడీపీకీ, సీపీఎంకీ మధ్య వ్యత్యాసమిదే..

క్ర‌మశిక్ష‌ణ‌కు మారుపేరైన సీఎం చంద్ర‌బాబుకు సొంత పార్టీ నేత‌లే షాక్ ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే తమ అధికార ఆధిప‌త్యాన్ని చూపించారు. అయితే ఇలా చేసినందుకు కేవ‌లం సారీతో స‌రిపెట్టారు. కానీ ఇదే త‌రహా సంఘ‌ట‌న కేర‌ళ‌లో ఎదురైంది. దీంతో ఏకంగా మంత్రినే ప‌ద‌వి నుంచే పీకేశారు! ప‌క్కా సాక్ష్యాలు ఉన్నా కేవ‌లం సారీ చెబితే ఇక వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని.. అంతా సైలెంట్ అయిపోయారు. కేర‌ళ‌లో మాత్రం అంతా రివ‌ర్స్‌లో జ‌రగ‌డం గ‌మ‌నార్హం!! త‌ప్పు చేస్తే ఎంత‌వారినైనా ఉపేక్షించేది […]

అసెంబ్లీలో టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్‌

ఏపీ అసెంబ్లీలో స‌భ్యుల మ‌ధ్య వింత ధోర‌ణి క‌నిపిస్తోంది. ఇది వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశాల్లో స‌భ్యుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు మాత్ర‌మే ఉండేవి. కానీ ఇప్పుడు స‌వాళ్లు, రాజీనామాల వ‌రకూ విష‌యం వెళ్లింది. అగ్రిగోల్డ్, స్పీక‌ర్ కోడెల వ్యాఖ్య‌ల‌పై జ‌రిగిన చ‌ర్చ ఆసాంతం వాడివేడిగా జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య స‌వాళ్లు తారస్థాయికి చేరాయి. ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత పై చేయి సాధించగా.. టీడీపీ మాత్రం కొంత అభ‌ద్ర‌తా భావ‌నికి లోనైందని […]

బీజేపీని తొక్కేసేందుకు బాబు కొత్త వ్యూహం!

ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా.. వాటిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే నేత‌ల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. టీడీపీ-బీజేపీ కూటమి విష‌యంలో చంద్ర‌బాబు వేస్తున్న అడుగులు చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు! బీజేపీకి టీడీపీతో ఉన్న అవ‌స‌రం కంటే.. టీడీపీకి-బీజేపీతో ఉన్న అవ‌స‌ర‌మే ఎక్కువ‌! కానీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీ మాత్రం టీడీపీపై ఆధార‌ప‌డ‌క త‌ప్ప‌ని స‌రి అనేంత‌గా ప‌రిస్థితుల‌ను మార్చేస్తున్నారు! అందుకు ఇటీవ‌ల విడుద‌లైన ప‌ట్ట‌భ‌ద్రుల‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ఆయ‌న చేసిన […]