చంద్రబాబుని కూడా ఇరికించే పనిలో బీజేపీ?

ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు కి హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ […]

ప్రత్యేక హోదా పై వ్యూహాత్మక చర్యల్లో బీజేపీ

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దృష్టిసారిస్తోంది. హోదా కంటే మెరుగైన ప్రయోజనం కల్పించేలా ప్యాకేజీ రూపొందించే ప్రయత్నాలు సాగుతున్నాయని మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు సహజంగానే  క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకో వడం సహజం. ఈ పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పక్షంలో బిజెపి ఇబ్బందులు పడాల్సివస్తుంది, కేంద్ర సర్కార్‌లో భాగస్వామ్యమైన ఏపీలోని టిడిపి సర్కార్‌పై ప్రజాగ్రహం పెరుగుతుంది. కానీ ఏపీలో బలపడాలని వ్యూహాలను […]

పవన్‌తో పోటీ ఎందుకు రోజా!

పవన్‌ ఏమీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. వస్తానంటున్నాడంతే. అలాంటి పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శిస్తే రోజాకి ఒనగూరే లాభమేంటట? రాజకీయాల్లో చిరంజీవి అంటే రోజాకి అస్సలు పడదు. టిడిపిలో ఉండగానే కాదు, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అయిన తరువాత కూడా రోజా, ఇంకా గట్టిగా చిరంజీవిని విమర్శిస్తూ వచ్చారు. చిరంజీవితోపాటు పవన్‌కళ్యాణ్‌ని కూడా విమర్శించడం ఆమెకు అలవాటు. టిడిపి గెలిచిందే పవన్‌కళ్యాణ్‌ దయతో అని చెబుతూనే పవన్‌కళ్యాణ్‌ని రబ్బర్‌సింగ్‌ అని తీసిపారెయ్యడం రోజాకే చెల్లింది. రబ్బర్‌సింగో, గబ్బర్‌సింగో రోజాకే బాగా […]

హోదా లేదు, అసలు ప్యాకేజీ రాదు!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనే లేదు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పాక ఇంకా హోదాపై ఆశలు పెట్టుకోవడం అనవసరం. ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెబితేనే, అందులో నిజం లేదన్నట్టు. ఆయనే లేదని చెబితే, ఇక అస్సలు అక్కడ హోదా గురించిన చర్చే లేదని అర్థం. ప్రత్యేక ప్యాకేజీ ఏదో తయారవుతోందని సుజనా చౌదరి చెబుతున్నా, అది నమ్మదగ్గదిగా కనిపించడంలేదు. ఎందుకంటే ప్యాకేజీ అంటేనే అదొక మాయ. విభజన కారణంగా ఏర్పడ్డ లోటు బడ్జెట్‌ని కేంద్రం […]

కవిత కూడా ఏపీ వైపే

ఇంతలో ఎంత మార్పు..రాజకీయం అంటే ఇదే నేమో..రెండేళ్ల క్రితం వరకు ఛీ..తూ అన్నవారే ఇప్పుడు బాసటగా నిలుస్తున్నారు..తెలంగాణాలో ఆంధ్ర విద్యా సంస్థల్ని నిషేదిస్తాం..తెలంగాణలో ఆంధ్ర హోటళ్లు నడవనివ్వం..ఇంకా మాట్లాడితే ఆంధ్రోళ్ళను తరిమి కొడతాం అన్న తెరాస నాయకులే ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర సెట్ట్లెర్స్ కి రెడ్ కార్పెట్ పరుస్తాం..ఆంధ్రోళ్ల కాళ్ళో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం అనే స్థాయికి వచ్చేసారు.అదే మరి రాజకీయం అంటే. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా […]