మీడియాకు కేసీఆర్ కూల్ వార్నింగా..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాట‌ల మాంత్రికుడ‌ని, ప్ర‌తిప‌క్షాల‌న్నా…రాజ‌కీయ చ‌తుర‌త క‌లిగిన నాయ‌కుడ‌ని, అభిమానులు అన్నా…ఈ గులాబీ బాస్ స్టైలే సెప‌రేటు. ప్ర‌తిప‌క్షాలు, మిత్ర‌ప‌క్షాలు, సొంత పార్టీ నేత‌లు…ఇలా ఎవ‌రినైనా స‌రే మాట‌ల‌తో క‌ట్టిప‌డేసే నైజం ఆయ‌న‌కే సొంతం. ఈ విష‌యంలో మీడియా కూడా మిన‌హాయింపు కాదు. ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. తాజాగా క్యాబినెట్ స‌మావేశం అనంత‌రం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్ మీడియాను హ్యాండిల్ చేసిన విధాన‌మైతే అదుర్స్ అని చెప్పొచ్చు. ఒక్క […]

కాంగ్రెస్ నాయ‌కులకు కేసీఆర్ ఝ‌ల‌క్‌

త‌న‌పై కాంగ్రెస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు బ‌డ్జెట్ రూపంలో స‌మాధాన‌మిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్! త‌న వ్యూహాల‌కు తిరుగులేద‌ని, త‌న‌తో పెట్టుకుంటే ఎవ‌రైనా చిత్తు కావాల్సిందేన‌ని మ‌రోసారి రుజువుచేశారు. అంతేగాక కాంగ్రెస్‌ను మ‌ళ్లీ మాట్లాడ‌కుండా చేశారు. దీంతో ఆ పార్టీ నేత‌లు సందిగ్ధ స్థితిలో ప‌డిపోయారు! ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాలపై ప‌ట్టు సాధించిన కేసీఆర్‌.. ఇప్పుడు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో బీసీల‌కే పెద్ద పీటే వేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని విమ‌ర్శిస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు.. చెక్ చెప్పారు. […]

వైసీపీ ఫైర్ బ్రాండ్‌ రోజాకి ఏమైంది..!

అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే రోజా ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తారు!! గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ఆమె చేసిన గ‌లాటా ఎవ‌రూ మ‌రిచిపోయి ఉండ‌రు! కానీ కొత్త అసెంబ్లీలో ఆమె మ‌రింత కొత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అస‌లు మాట్లాడ‌ట‌మే మానేశారు! ఎదురుదాడికి దిగ‌డంలేదు! ప‌క్క నుంచి సెటైర్లు వేయ‌డం లేదు! ర‌క‌రకాల హావ‌భావాలు ఆమె మోములో క‌నిపించ‌డం లేదు! తొలిరోజు అసెంబ్లీలో రోజా వెనక సీట్లో కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకీ వింత ప్ర‌వ‌ర్త‌న‌.. అంటే దీని వెనుక […]

త‌మిళ అసెంబ్లీ సాక్షిగా ఓడిన ముగ్గురు

త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం ప‌ళ‌నిస్వామి బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గుతారా ? లేదా ? అన్న ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఈ రోజు జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో పళనిస్వామి రాజకీయ చతురత ముందు మరోసారి పన్నీరు సెల్వం, డీఎంకే బొక్కబోర్లపడ్డాయి. త‌మిళ అసెంబ్లీలో కురుక్షేత్రాన్ని త‌ల‌పించేలా జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలో సీఎం పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. వ్యతిరేకంగా 11 వ్యతిరేక ఓట్లుపడ్డాయి. ఇక ఈ బ‌ల‌ప‌రీక్ష‌లో పైకి ప‌న్నీరు సెల్వం ఓడిన‌ట్లు క‌నిపిస్తున్నా ఓవ‌రాల్‌గా మాత్రం […]

టీ అసెంబ్లీలో కేసీఆర్‌ను అడిగేవాడేడి..!

తెలంగాణ అసెంబ్లీలో హిట్ ఎవ‌రు? ఫ్లాప్ ఎవ‌రు? తాజాగా ముగిసిన శీతాకాల స‌మావేశాల అనంత‌రం పొలిటిక‌ల్ పండితులు పెట్టిన దృష్టి దీనిపైనే. వాస్త‌వానికి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణ‌యాల‌పై స‌భ వెలుప‌ల కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నేత‌లు పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతున్నారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ మొద‌లుకుని ప్ర‌గ‌తి భ‌వ‌న్, డ‌బుల్ బెడ్ రూం, హైద‌రాబాద్ రోడ్లు, రైతుల మ‌ర‌ణాలు, విద్యార్థుల ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ఇలా అనేక విష‌యాల‌పై మీడియా గొట్టాలు ప‌గిలిపోయేలా కేసీఆర్‌, ఆయ‌న టీంపై విప‌క్ష […]

జానా లెక్క‌.. ఈ స‌మావేశాల్లోనే తేల‌నుందా ?

తెలంగాణలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌గా ఉన్న మాజీ మంత్రి, మేధావిగా పేరుప‌డ్డ కుందూరు జానారెడ్డి గురించే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లోకి ఎంద‌రో జంప్ చేశారు. అయినా కూడా వారిపై ఎలాంటి చ‌ర్చ ఇంత‌స్థాయిలో జ‌ర‌గ‌లేదు. అయితే, జానా గురించే ఎందుకు చ‌ర్చిస్తున్నారంటే.. వాస్త‌వానికి కాంగ్రెస్‌లో జానా వంటి సీనియ‌ర్ నేత‌లు ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ లేరు. ఈ క్ర‌మంలో జానాను అంద‌రూ కాంగ్రెస్‌లో పెద్ద దిక్కుగా […]

ఎంపీ ప‌ద‌వికి క‌విత గుడ్ బై

రాజ‌కీయాల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి. దీనికి ఎవ్వ‌రూ అతీతులు కారు! ప్ర‌స్తుతం ఇలాంటి ఓ పెద్ద వ్యూహంలోనే ఉన్నార‌ట తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌. ప్ర‌స్తుతం ఆమె నిజామాబాద్ పార్లెమెంటు స్థానం నుంచి ఎంపీగా 2014లో గెలుపొందారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటున్నార‌న్న టాక్ తెచ్చుకున్నారు. అయితే, ఎంపీగా తాను కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయాను అనే ఫీలింగ్ ఆమెలో నెల‌కొంద‌ట‌! దీంతో త‌న వ్యూహాన్ని ఆమె అసెంబ్లీ వైపు మ‌ళ్లించారు. […]

చంద్ర‌బాబు – కేసీఆర్ ఫీట్లు చూశారా..!

ఇప్ప‌టికే ఒక ప‌క్క ప్ర‌భుత్వ పాల‌న‌, మ‌రోప‌క్క పార్టీ కార్య‌క‌లాపాల వ్యూహ ర‌చ‌న‌ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు స‌రికొత్త ఫీట్లు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బ‌లంగా ఉన్న ప్ర‌ధాన విప‌క్షాల‌ను నిర్వీర్యం చేసే క్ర‌మంలో ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించారు ఇద్ద‌రు చంద్రులు. ఆప‌ర్ ఆక‌ర్ష్‌కి తెర‌తీసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. టీడీపీ, కాంగ్రెస్‌, వైకాపా ఆఖ‌రికి క‌మ్యూనిస్టులను సైతం త‌న కారెక్కించుకున్నారు. […]

రోజా రాజీ – కథ అయిపోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రోజా రీ ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రోజా దురుసు ప్రవర్తన కారణంగా ఆమెను ఏడాదిపాటు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. కొన్నాళ్ళు బెట్టు చేసినా, తిరిగి అసెంబ్లీలోకి వెళ్ళేందుకు రోజా క్షమాపణ చెప్పక తప్పలేదు. క్షమాపణను రాత పూర్వకంగా ఆమె తెలియజేసినప్పటికీ, అసెంబ్లీకి ఆమెతో ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పించాలని అధికార పార్టీ అనుకుంటోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా, టిడిపి మహిళా ఎమ్మెల్యే అనితపైనా […]