బాహుబ‌లి-2  సునామీలో `ఖాన్‌`ల రికార్డులు చెల్లాచెద‌రు

బాలీవుడ్ `ఖాన్‌`ల రికార్డులు సునామీలో కొట్టుకుపోయాయి. ప్రపంచం నివ్వెర పోయేలా.. అంద‌రూ అవాక్క‌య్యేలా.. ఒక తెలుగు సినిమా క‌లెక్ష‌న్ల దండయాత్ర చేస్తోంది. ఒక్క బాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కుల‌కే సాధ్య‌మ‌నుకున్న 1000కోట్ల మార్కును అందుకునేందుకు తెలుగు సినిమా ఒకే అడుగు దూరంలో నిలిచింది. `ఇది తెలుగొడి స‌త్తా` అని చాటుతోంది బాహుబ‌లి-2. తెలుగువాళ్లంతా స‌గ‌ర్వంగా ఇది మా సినిమా అనుకునేలా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అద్భుత చిత్రంగా నిలిచింది. దర్శక ధీరుడు రాజ‌మౌళి అద్భుత సృష్టికి ప్రేక్ష‌కులు స‌లామ్ […]

బాహుబ‌లి 2పై వాళ్ల‌కు అసూయ‌, కుళ్లు

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా బాహుబ‌లి -ది కంక్లూజ‌న్ సాగిస్తోన్న వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం దెబ్బ‌తో ఇండియ‌న్ సినిమా ట్రేడ్‌వ‌ర్గాలు, ఎన‌లిస్టులు షాక్ అవుతున్నారు. ఇండియ‌న్ సినిమాకే త‌ల‌మానికంగా చెప్పుకునే బాలీవుడ్ సినిమాలు లైఫ్ టైం లేదా లాంగ్ ర‌న్‌లో సాధించే వ‌సూళ్ల‌ను బాహుబ‌లి కేవ‌లం ఆరు రోజుల‌కే తుడిచిపెట్టేసింది. బాహుబ‌లి ఈ రేంజ్‌లో విజృంభిస్తుంటు, ఎంతోమంది సెల‌బ్రిటీలు సైతం ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే బాలీవుడ్ ప్ర‌ముఖుల ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌క‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. బాలీవుడ్‌లో ఏ ఖాన్ సినిమానో […]

బాహుబ‌లి తెలుగు క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ అంచ‌నా..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌త నెల 28న రిలీజ్ అయిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ నిమిషానికో రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 వేల స్క్రీన్ల‌లో రిలీజ్ అయిన ఈ అపురూప దృశ్య‌కావ్యం ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోన్న అన్ని థియేట‌ర్ల‌లోను 95 శాతం అక్యుపెన్సీతో న‌డుస్తోంది. తొలి 5 రోజుల‌కే రూ.100 కోట్ల షేర్ రాబ‌ట్టిన బాహుబ‌లి 2 6 రోజుల‌కు ఏపీ+తెలంగాణ‌లో క‌లుపుకుని రూ.109 కోట్ల […]

బాహుబలి క్రేజ్ మరింత

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వీరంగం ఆడుతోంది. ఈ సినిమా భార‌త్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమెరికా, దుబాయ్‌, సౌదీ అరేబియా, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల‌లో స‌త్తా చాటుతోంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్ప‌టికే లెక్క‌కు మిక్కిలిగా ఎన్నో రికార్డులు త‌న అక్కౌంట్‌లో వేసుకుంది. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2 సినిమాను ఇప్పుడు మ‌రో రెండు భాష‌ల్లోకి డ‌బ్ […]

రూ.700 కోట్ల క్ల‌బ్‌లో ” బాహుబ‌లి 2 “

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి త‌న జ‌ర్నీలో ఓ మైలురాయిని చేరేసుకుంది. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైం రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌ని అంచ‌నాలున్న బాహుబ‌లి 2 ఇప్ప‌టి వ‌ర‌కు రూ.700 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. తొలి 5 రోజుల‌కు బాహుబ‌లి 2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 367 కోట్ల షేర్, రూ. 700 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది. ఈ సినిమా ఏపీలో 54.4 కోట్లు – సీడెడ్‌లో 17.4 కోట్లు – నైజాంలో 28.4 […]

” బాహుబ‌లి 2 ” 5 డేస్ తెలుగు & హిందీ క‌లెక్ష‌న్స్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న బాహుబ‌లి 2 సినిమా ఏపీ+తెలంగాణ‌లో దూసుకుపోతోంది. వ‌సూళ్ల ప‌రంగా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు వెర్ష‌న్‌లో ఏపీ+తెలంగాణ‌లో ఈ సినిమా 5 రోజుల‌కు రూ.100 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఐదో రోజున కూడా బాహుబ‌లి 2 వ‌సూళ్లు ఇలా ఉన్నాయి. ఏరియాల వారీగా బాహుబ‌లి 2 5 రోజుల వ‌సూళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. నైజాం – 28.15 కోట్లు సీడెడ్ – 17.45 […]

ర‌జ‌నీ ఆఫ‌ర్‌తో రాజ‌మౌళికి ఇబ్బందులు

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌తో సినిమా చేసేందుకు పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు క్యూ క‌డుతుంటారు! ఆయన డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ర‌జ‌నీకాంత్ మాత్రం ఇప్పుడు.. ఒక ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. త‌న డేట్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఆద‌ర్శ‌కుడెవ‌రనేగా మీ సందేహం.. ఆయ‌నే తెలుగు సినిమా గురించి ప్ర‌పంచ‌మంతా ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన ద‌ర్శక‌ధీరుడు రాజ‌మౌళి! ఇప్ప‌టికే బాహుబ‌లి-2తో దేశవ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న జ‌క్క‌న్న‌తో సినిమా చేయాల‌ని ర‌జ‌నీకాంత్ ఎంతోకాలం […]

ఓవ‌ర్సీస్‌లో `బాహుబ‌లి` రికార్డు బ‌ద్ద‌లు

అమ‌రేంద్ర బాహుబ‌లి దండ‌యాత్ర ముందు.. రికార్డుల‌న్నీ దాసోహ‌మ‌వుతున్నాయి. `సాహో` అంటూ స‌లామ్ కొడుతున్నాయి. ద‌ర్శ‌క ధీరుడి టేకింగ్‌కు ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్, బాలీవుడ్.. అన్ని వుడ్‌ల ప్రేక్ష‌కులు బాహుబ‌లి-2కి నీరాజ‌నం ప‌డుతున్నారు. దేశంలోనే కాదు ఓవ‌ర్సీస్‌లోనూ బాహుబ‌లి-2 రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఈ దెబ్బ‌కి అంత‌కుముందు ఉన్న రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంకో విశేష‌మేంటంటే.. బాహుబ‌లి-1 రికార్డును బాహుబలి-2 అధిగమించింది. ఇత‌ర హీరోల‌కు స‌రికొత్త టార్గెట్‌లు ఫిక్స్ చేస్తోంది. బాహుబ‌లి-2.. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డులు […]

`బాహుబ‌లి-3`పై జ‌క్క‌న్న క్లూ ఇచ్చాడా?

బాహుబ‌లి రెండు భాగాల‌ను విజ‌యవంతంగా తెర‌కెక్కించి తెలుగు సినిమా స్థాయిని మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి! ఎవ‌రికీ అందనంత ఎత్తులో నిలుచున్నాడు జ‌క్క‌న్న‌! అయితే బిగినింగ్, కన్‌క్లూజ‌న్ అని రెండు పార్టులు చెప్పేసినా.. ఇంకా ప్రేక్ష‌కులకు స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు మిగిలే ఉన్నాయి. అవేంటంటే.. బాహుబ‌లి సిరీస్ ఇక్క‌డితో ఆగిపోతుందా? లేక కొన‌సాగుతుందా? అనేది ఇప్పుడు అందరిలోనూ ఉంది. బాహుబ‌లి కంటిన్యూ ప్రాసెస్ అని గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు రాజ‌మౌళి! సో అంతా […]