గెలుపే ధ్యేయంగా టీడీపీ బరిలోకి

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మిగిలి ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు చాప‌కింద నీరులా ప్లాన్లు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 13 జిల్లాల‌కు టీడీపీ టీంను ఆయ‌న రెడీ చేసేశారు. ప్ర‌స్తుతం టీడీపీలో జ‌రుగుతున్న జిల్లా, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌య్యింది. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడి ఎంపిక మాత్రం పెండింగ్‌లో ఉండ‌గా… మిగిలిన అన్ని జిల్లాలు, న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల ఎంపిక పూర్త‌య్యింది.

శ్రీకాకుళం జిల్లా తెదేపా అధ్యక్షురాలిగా ప‌లాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుంద‌ర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష పేరును ఎంపిక చేసినట్టు సమాచారం. విశాఖపట్నం నగర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా య‌ల‌మంచిలి ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా జ‌డ్పీ చైర్మ‌న్ నామన రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు రాజ్య‌స‌భ ఎంపీ తోట సీతారామలక్ష్మిని ఆయన ఖరారు చేశారు.

కీలకమైన కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, విజయవాడ అర్బన్‌కు మ‌రో ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ప్రకాశం జిల్లాకు ఒంగోలు

దామచర్ల జనార్దన్, నెల్లూరు జిల్లాకు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, చిత్తూరు జిల్లాకు పులివర్తి నాని, అనంతపురం జిల్లాకు పెనుగొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, కడప జిల్లాకు శ్రీనివాసరెడ్డి, కర్నూలు జిల్లాకు సోమిశెట్టి వెంకటేశ్వర్లును పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నియమించారు. ఇక విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడి ఎన్నిక మాత్రం పెండింగ్‌లో ఉంది.