క‌న్‌ఫ్యూజ‌న్ లో తెలుగు ప్రేక్ష‌కులు.. మూడు సినిమాల‌ ఫ‌లితాలు

టాలీవుడ్‌లో స‌హ‌జంగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. గ‌తేడాది ఏకంగా నాలుగు సినిమాలు నాన్న‌కు ప్రేమ‌తో – డిక్టేట‌ర్‌- ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయ‌నా వ‌చ్చి నాలుగు హిట్ అయ్యాయి. ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే పైన చెప్పుకున్న‌ట్టు ఆ సినిమాలు ఒక రోజు తేడాలో రిలీజ్ అయ్యాయి. ఇందుకు భిన్నంగా నిన్న టాలీవుడ్‌లో ఒకేరోజు మూడు మంచి అంచ‌నాలు ఉన్న సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి.

 “నేనే రాజు నేనే మంత్రి’’ ‘జయ జానకి నాయక’  ‘లై” సినిమాలు ప్రచార విషయంలో విపరీతంగా సక్సెస్ అయ్యాయి.  వాస్తవానికి  ఈ మూడు సినిమాలు మూడు జోనర్స్‌లో తెర‌కెక్కాయి. ఒకే రోజు మూడు సినిమాలు రావ‌డంతో జ‌నాలు తొలి రోజు మూడు సినిమాలు ఆడుతున్న థియేట‌ర్ల వైపు ప‌రుగులు పెట్టారు. ఐదు రోజుల భారీ లాంగ్ వీకెండ్ రావ‌డంతో ఈ మూడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.

ఈ మూడు సినిమాలు తొలి రోజు అనంత‌రం ఓకే అన్న టాక్ తెచ్చుకున్నాయి. మూడు సినిమాల్లో దేనికి భారీ నెగిటివ్ టాక్ అయితే లేదు. బోయ‌పాటి శ్రీను మార్క్ మాసిజం ఉన్న జ‌య జాన‌కి నాయ‌క బీ, సీ సెంట‌ర్ల‌లో హోరెత్తిస్తోంది. తొలి రోజు మంచి టాక్‌తో పాటు అంచ‌నాల‌ను అందుకున్న సినిమాగా జాన‌కి నిలిచింది. ఓవ‌ర్సీస్‌లో మాత్రం ఈ సినిమా మిగిలిన రెండు షోల‌తో పోల్చుకుంటే వెన‌క‌ప‌డింది.

ఇక రెండో ప్లేస్‌లో ఉన్న నితిన్ లై స్టైలిష్ యాక్ష‌న్ మూవీ అన్న టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఏ సెంట‌ర్ల‌తో పాటు మ‌ల్టీఫ్లెక్స్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతోంది. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా క‌న్‌ఫ్యూజ‌న్ మిగులుస్తోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమా ఫ‌స్టాఫ్ బాగున్నా సెకండాఫ్ సాగ‌దీత‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌ని యాంటీ క్లైమాక్స్ సినిమాకు మైన‌స్‌గా మారాయి. ఓవ‌రాల్‌గా సినిమా ఆశించిన అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌న్న టాక్ వ‌చ్చింది.

ఫ‌స్ట్ డే త‌ర్వాత మూడు సినిమాల్లోను జ‌య జానకి నాయ‌క పై చేయి సాధించిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఐతే లాంగ్ వీకెండ్ రావ‌డంతో శ‌ని, ఆదివారాల‌తో ఈ మూడు సినిమాలు పూర్తి ఫ‌లితాలు తేల‌నున్నాయి.