బిగ్ బాస్ షో త్రివిక్ర‌మ్‌కు న‌చ్చ‌లేదా

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షోపై ఇప్ప‌టికే మిక్స్ డ్ టాక్ న‌డుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా హిట్ అయినా…ఈ షోలో కంటెస్టెంట్స్ మాత్రం ఎన్టీఆర్ రేంజ్‌కు త‌గిన‌వారు కాద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో పాటు మ‌మైత్ ఖాన్ లాంటి డ్ర‌గ్స్ కేసుల్లో చిక్కుకున్న వారు కూడా ఈ షోలో ఉండ‌డంతో ఇప్ప‌టికే దీనిపై వివాదాలు ముసురుకున్నాయి.

ఇదిలా ఉంటే ఈ షోపై టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గాసిప్స్ వ‌స్తున్నాయి. మ‌రి ఈ షోకు త్రివిక్ర‌మ్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా త్రివిక్ర‌మ్ ఈ షోపై ఓ విష‌యంలో మాత్రం అసంతృప్తితో ఉన్నాడ‌ట‌.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల‌లో హ‌రితేజ కూడా ఉన్నారు. హ‌రి తేజ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ – ప‌వ‌న్ కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమాలో కూడా ఓ రోల్ చేస్తోంద‌ట‌. హ‌రి తేజ ఇప్ప‌టికే బుల్లితెర మీద సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. అ..ఆ సినిమాలో ఆమె స‌మంత ప‌క్క‌న కూడా న‌టించింది.

ఈ క్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ ప‌వ‌న్‌తో తాను చేస్తోన్న తాజా సినిమాలో కూడా ఆమెకు ఓ రోల్ ఇచ్చాడు. ఆమెపై కొన్ని స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించారు. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్‌లో ఉండ‌డంతో ఆమె సెప్టెంబ‌ర్ వ‌ర‌కు అక్క‌డే ఉండాలి. దీంతో త్రివిక్ర‌మ్‌కు ఆమెతో తీయాల్సిన సీన్ల విష‌యంలో ఇబ్బందులు త‌ప్పేలా లేవు. దీంతో హ‌రితేజ అలా బిగ్ బాస్ హౌస్‌లో బుక్ అవ్వ‌డంతో త్రివిక్ర‌మ్ ఆమెపై కాస్త అస‌హ‌నంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.