డ్ర‌గ్స్ ఇష్యూ లిస్ట్ 12 కాదు 16… నాలుగు కొత్త పేర్లు 

July 21, 2017 at 2:20 pm
tollywood

డ్రగ్స్ మాఫియాలో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. ఇప్ప‌టికే ఈ దందాలో 12 మంది సినీప్ర‌ముఖుల‌ను గుర్తించిన సిట్ అధికారులు వారికి నోటీసులు జారీ చేసి విచార‌ణ కొన‌సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త మూడు రోజులుగా జ‌రుగుతోన్న విచార‌ణ‌లో ఇప్పుడు కొత్త‌గా మరో నాలుగు పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

బడాబాబుల కుమారులు మాదక ద్రవ్యాల రాకెట్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కొత్త పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కెల్విన్‌ సృష్టించిన డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా వీరు తమ ఇంటి అడ్రస్‌లకు డ్రగ్స్‌ తెప్పించుకున్నట్టు తెలిసింది.

నలుగురు విద్యార్థులు ఐఏఎస్‌ అధికారి, డాక్టర్‌, బడా కంపెనీ డైరెక్టర్‌, స్టాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కుమారులుగా గుర్తించారు. వీరంతా ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ న‌లుగురు విద్యార్థుల‌ను కూడా పోలీసులు విచారించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

డ్ర‌గ్స్ ఇష్యూ లిస్ట్ 12 కాదు 16… నాలుగు కొత్త పేర్లు 
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts