తొలి రోజు హీరో ఎవ‌రు… క‌లెక్ష‌న్లు చెపుతోన్న స‌త్తా ఇదే

ఒకే రోజు టాలీవుడ్‌లో మూడు క్రేజీ సినిమాలు రావ‌డంతో తెలుగు సినిమా ప్రియులు పండ‌గ చేసుకున్నారు. గ‌త రెండు సంక్రాంతి పండ‌గ‌ల‌కు ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అయినా ఏదీ నెగిటివ్ తెచ్చుకోలేదు. షాకింగ్‌గా ఇప్పుడు ఈ మూడు సినిమాల్లో ఏదీ నెగిటివ్ తెచ్చుకోక‌పోవ‌డం విశేషం. ఇక ముగ్గురు యంగ్ హీరోల మ‌ధ్య బాక్సాఫీస్ వేదిక‌గా జ‌రిగిన ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో మూడు సినిమాల‌కు మంచి వ‌సూళ్లే తొలి రోజు ద‌క్కాయి.

ఏపీ, తెలంగాణ వ‌ర‌కు చూస్తే మాస్ అప్పీల్ ఉన్న సినిమాల‌కే ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో ఆస‌క్తి రేప‌డంతో పాటు భారీగా రిలీజ్ చేయ‌డంతో రానా నేనే రాజు నేనే మంత్రి తొలి రోజు మిగిలిన రెండు సినిమాల క‌న్నా ఎక్కువ వ‌సూళ్లు రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు ఏపీ+తెలంగాణ‌లో 3.72 కోట్లు వసూలు చేసింది. నైజాంలో 1.22 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్‌లో కూడా టాప్ ప్లేస్‌లో ఉంది. రానాకు సోలో హీరోగా ఇవే హ‌య్య‌స్ట్ ఫ‌స్ట్ డే కలెక్ష‌న్స్‌.

ఇక బోయ‌పాటి మార్క్ మాసిజం సినిమా జ‌య జాన‌కి నాయ‌క కూడా నేనే రాజు నేనే మంత్రికి ధీటుగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమా ఏపీ, తెలంగాణ‌లో ఫ‌స్ట్ డే 3.27 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో థియేటర్లు దొర‌క్క‌పోయినా బీ, సీ సెంట‌ర్ల‌లో దుమ్ము రేపే రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్టింది. నైజాంలో ఈ చిత్రానికి రూ.90 లక్షల ఫస్ట్ డే షేర్ వచ్చింది.

ఇక పై రెండు సినిమాల‌తో పోలిస్తే లై త‌క్కువ వ‌సూళ్లతో మూడో ప్లేస్‌లో నిలిచింది. లై ఫ‌స్ట్ డే ఏపీ+తెలంగాణ‌లో రూ. 2.28 కోట్ల షేర్ వచ్చింది. ఇది క్లాస్ సెంట‌ర్ల‌కు క‌నెక్ట్ అయ్యే సినిమా కావ‌డంతో అనుకున్న రేంజ్‌లో వ‌సూళ్లు రాలేదు. అయితే ఓవ‌ర్సీస్‌లో మాత్రం ఈ సినిమాకే ఎక్కువ వసూళ్లు వ‌చ్చే ఛాన్సులు ఉన్నాయి.