టీఆర్ఎస్‌లోకి టాలీవుడ్ హీరో!

ఇప్ప‌టికే అన్నిపార్టీల్లోని నేత‌లు టీఆర్ఎస్‌కు ఆక‌ర్షితులై.. గులాబీ కండువా క‌ప్పేసుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కొంత‌మంది హీరోలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నార‌ట‌. ఏపీలో టీడీపీకి ఎలాగూ సినీ గ్లామర్ పుష్క‌లంగా ఉంది. ఇక టీఆర్ఎస్‌కు కూడా ఆ కొర‌త తీరిపోనుంది. ప్ర‌ముఖ సినీ న‌టుడు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా క‌ప్పేసుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. అంత‌కుముందు త‌న‌కు పాలిటిక్స్‌లోకి రావాల‌ని చెప్ప‌డం.. త‌ర్వాత సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌డం వంటివి చూస్తే.. ఆయ‌న `కారు`లో ఎక్కుతార‌ని అంతా భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత అదికార టీఆర్ ఎస్ పార్టీకి తిరుగు లేకుండా పోయింది.టీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ అపరేషన్ అకర్ష్ దెబ్బతో టీడీపీ, కాంగ్రెస్ లోని చాలామంది ఎమ్మెల్యేలు కారెక్కెసారు. ముఖ్యంగా తెలంగాణ టీడీపీలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవంత్ రెడ్డి, తెలంగాణ తెలుగు దేశం అధ్య‌క్షుడు ఎల్. రమణ, టీటీడీపీ నేత కృష్ణయ్య మాత్రమే మిగిలారు. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రతిపక్షాలకు చెందిన చాలా మంది నేతలు టీఆర్ ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరో టీఆర్ ఎస్ లో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయన ఎవరో కాదు సీనియర్ హీరో సుమన్. తాజాగా సుమన్ తెలంగాణ సీయం కేసీఆర్ తో సమావేశం కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. సుమన్ ఓ పర్యటనలో బాగంగా `నేను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తానని, ఏ పార్టీలో చేరతానో ఇంకా డిసైడ్ కాలేద`ని తెలిపారు. తాజాగా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సుమన్ బేటీ కావడంతో సుమన్ టీఆర్ ఎస్ లో చేరడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా సుమన్ టీఆర్ ఎస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. మరి ఇప్ప‌డైనా ఈ వ్యాఖ్య‌లు నిజ‌మ‌వుతాయో లేదో!!