సునీల్ బ్యాక్ టు పెవిలియన్?

July 19, 2017 at 4:58 am
Suneel

క‌మెడియ‌న్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే సునీల్‌కు ఎక్క‌డా లేని స్టార్‌డ‌మ్ వ‌చ్చేసింది. సునీల్ క‌మెడియ‌న్‌గా ఆరేడేళ్ల‌పాటు టాలీవుడ్‌ను ఏలేశాడు. అస్స‌లు సునీల్ కాల్షీట్లు ఖాళీ ఉండేవి కావు. సునీల్ కాల్షీట్ల కోసం స్టార్ హీరోలే వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా ట‌ర్న్ తీసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్లే కొట్టాడు. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో మ‌ర్యాద రామ‌న్న లాంటి హిట్ త‌ర్వాత సునీల‌ల్ కెరీర్ పీక్స్‌కు చేరిపోయింది.

అప్పటి నుంచి సునీల్‌కు గ్ర‌హ‌దోషం ప‌ట్టుకున్న‌ట్లుంది. హీరోగా చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌పెట్టి ప్లాప్‌ల మీద ప్లాపులు అవుతున్నాయి. హీరోగా ఇప్పుడు చాలా బ్యాడ్ టైంలో ఉన్నాడు. కామెడీ హీరోగా ఎదిగిన సునీల్ చివ‌ర‌కు ఆ కామెడీ ప‌క్క‌న పెట్టేసి మాస్ ఇమేజ్ కోసం యాక్ష‌న్ క‌థ‌లు ఎంచుకుని బొక్క బోర్లాప‌డ్డాడు.

చివ‌రకు సునీల్ సినిమాల‌కు బిజినెస్‌, శాటిలైట్ మార్కెట్ కూడా జ‌ర‌గ‌ని స్థితి నెల‌కొంది. సునీల్ చివ‌రి రెండు సినిమాలు జ‌క్క‌న్న‌, వీడు గోల్డ్ ఎహే సినిమాల‌కు ఇంకా శాటిలైట్ మార్కెట్ అవ్వలేదు. ఇక క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఉంగ‌రాల రాంబాబు సినిమాకు బిజినెస్ కాక గ‌త నాలుగు నెల‌లుగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ దాట‌లేక‌పోతోంది.

ఇక సునీల్ హీరోగా తెర‌కెక్కుతోన్న మ‌రో సినిమా కూడా నత్తనడకన సాగుతుందని సమాచారం. దీంతో విసుగుచెందిన సునీల్ ఈ రెండు సినిమాల త‌ర్వాత హీరో రోల్స్‌కు గుడ్ బై చెప్పేసి తిరిగి క‌మెడియన్‌గా యూట‌ర్న్ తీసుకోనున్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్‌లో టాక్ వినిపిస్తోంది. మ‌రి యూట‌ర్న్ తీసుకున్నాక అయినా సునీల్ కామెడియ‌న్‌గా విజృంభిస్తాడేమో చూడాలి.

 

సునీల్ బ్యాక్ టు పెవిలియన్?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts