టాలీవుడ్‌లో ఈ వారం ట్రేడ్ టాక్‌

టాలీవుడ్‌లో ఈ యేడాది మ‌రో వారం చ‌రిత్ర‌లో క‌లిసింది. గ‌త వారం రిలీజ్ అయిన మ‌ణిర‌త్నం – కార్తీ చెలియా గురించి ఎంత త‌క్కువుగా మాట్లాడుకుంటే అంత మంచిది. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు బ్యాన‌ర్‌లో రిలీజ్ చేసినా సినిమాకు థియేట‌ర్ల రెంట్లు కూడా రాని ప‌రిస్థితి. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ రైట్స్‌ను రాజు రూ 7.5 కోట్ల‌కు సొంతం చేసుకున్నాడ‌ట‌. ఓవ‌రాల్‌గా సినిమాకు థియేట‌ర్ల రెంట్లు రాలేదంటే రాజు ఎంత లాస్ అయ్యాడో తెలుస్తోంది.

ఇక చెలియా నిరాశ‌ప‌ర‌చ‌డంతో అంత‌కు ముందు వారం రిలీజ్ అయిన గురు పుంజుకుంది. గురుకు బీ, సీ సెంట‌ర్ల‌లో కూడా ఓకే అనే స్థాయిలో వ‌సూళ్లు వ‌చ్చాయి. గురు ఏపీ, తెలంగాణ‌లో రూ. 14 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమాకు ఇప్ప‌టికే రూ. 17 కోట్ల షేర్ రావ‌డంతో గురు బ‌య్య‌ర్లు లాభాల్లోకి వ‌చ్చేశారు.

స‌మ్మ‌ర్ సినిమాల్లో గురు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ అనిపించుకుంది. అయితే బాక్సాఫీస్‌ను శాసించే స్టామినా గురుకు లేక‌పోవ‌డంతో అటు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌తో పాటు బీ, సీ సెంట‌ర్ల‌లో చాలా థియేట‌ర్లు వెల‌వెల‌బోతున్నాయి. ఇప్పుడు థియేట‌ర్ల‌న్ని క‌ళ‌క‌ళ‌లాడాలంటే ఏప్రిల్ 28న బాహుబ‌లి రావాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి.

ఇక ఈ శుక్ర‌వారం వ‌రుణ్ తేజ్ – శ్రీను వైట్ల మిస్ట‌ర్‌, లారెన్స్ డ‌బ్బింగ్ మూవీ శివ‌లింగ వ‌చ్చాయి. అయితే మిస్ట‌ర్ ఫ‌స్ట్ షోకే పూర్ టాక్‌తో బాక్సాఫీస్ ర‌న్ స్టార్ట్ చేసింది. శివ‌లింగ‌కు ఫైనాన్స్ ప్రాబ్ల‌మ్స్ ఉండ‌డంతో ఈ సినిమాకు ఉద‌యం ఆట‌లు క్యాన్సిల్ అయ్యాయి.