నెక్ట్స్ సినిమాల రిలీజ్ డేట్లు ఇవే

August 18, 2017 at 11:41 am
Tollywood

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం సినిమా ప్రేమికులు ఓ రేంజ్‌లో పండ‌గ చేసుకున్నారు. టాక్ ఎలా ఉన్నా మూడు సినిమాల‌ను ప్రేక్ష‌కులు బాగానే ఆద‌రిస్తున్నారు. జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి మూడు సినిమాల‌కు నెగిటివ్ టాక్ రాక‌పోవ‌డంతో పాటు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావ‌డంతో సినీ అభిమానులు ఎంచ‌క్కా సినిమాల‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమాల‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే ఈ మూడు సినిమాల ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా త‌మ సినిమాల‌కు పోటీ ఉన్నా అనుకున్న డేట్‌కే రిలీజ్ చేశారు. ఈ మూడు సినిమాలు వ‌చ్చేశాయి. ఇక రిలాక్స్ అవుదాం అనుకుంటే ప్రేక్ష‌కుల‌కు క‌ష్ట‌మే. ఈ సినిమాల వ‌రద ఆగేలా లేదు. ఆగస్టుతో పాటు సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌తి వారం మంచి అంచ‌నాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఈ శుక్ర‌వారం 18న తాప్సీ, శ్రీనివాస్‌రెడ్డి ఆనందో బ్ర‌హ్మ వ‌స్తోంది. ధ‌నుష్ విఐపి-2 అదే రోజు అనుకున్నా ఆగ‌స్టు 24న అజిత్ వివేగంతో పోటీకి వ‌స్తోంది. ఇవి రెండు డ‌బ్బింగ్ సినిమాలే అయినా వీటికి సూప‌ర్ క్రేజ్ ఉంది. ఆగ‌స్టు 25నే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి వ‌స్తోంది.

ఇక సెప్టెంబ‌ర్ 1న బాల‌య్య న‌టించిన పైసా వ‌సూల్ భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌స్తోంది. ఆ మ‌రుస‌టి రోజే సునీల్ ఉంగ‌రాల రాంబాబు థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. సెప్టెంబర్ 8 నాగ చైతన్య యుద్ధం శరణం, మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు ఒకే రోజు విడుదల అవుతాయి.

ఇక సెప్టెంబ‌ర్ 14న సాయిధ‌ర‌మ్ తేజ్ జ‌వాన్ వ‌స్తుంద‌నుకున్నా అది న‌వంబ‌ర్ 8కు వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక సెప్టెంబ‌ర్‌లో పెద్ద సినిమాల హంగామా మామూలుగా లేదు. 21న జై లవకుశ, 27న స్పైడర్ వ‌స్తున్నాయి.

 

ఆగస్ట్ 24 – విఐపి 2, వివేగం

ఆగస్ట్ 25 – అర్జున్ రెడ్డి, మేడ‌మీద అబ్బాయి

సెప్టెంబర్ 1- పైసా వసూల్

సెప్టెంబర్ 8 – యుద్ధం శరణం, ఒక్కడు మిగిలాడు

సెప్టెంబర్ 21 – జై లవకుశ

సెప్టెంబర్ 27- స్పైడర్

న‌వంబ‌ర్ – 8 జ‌వాన్‌

 

నెక్ట్స్ సినిమాల రిలీజ్ డేట్లు ఇవే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts