ప‌వ‌న్ – మ‌హేష్ – ఎన్టీఆర్‌…నైజాంలో ఎవ‌రి స‌త్తా ఎంత‌

టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముగ్గురూ కెరీర్‌ప‌రంగా దూసుకుపోతున్నారు. వీరి ముగ్గురిలో ఒక‌రు ఓ సారి పైచేయిలో ఉంటే మ‌రో యేడాది మ‌రో హీరో పైచేయి సాధిస్తున్నాడు. గ‌బ్బ‌ర్‌సింగ్‌, అత్తారింటికి దారేది హిట్ల‌తో ప‌వ‌న్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు, మ‌హేష్ దూకుడు -బిజినెస్‌మేన్‌-సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాల‌తో టాప్‌లో ఉన్నారు.

ఆ టైంలో ఎన్టీఆర్ వ‌రుస ప్లాపులు ఎదుర్కొని కెరీర్ ప‌రంగా డౌన్‌లో ఉన్నాడు. ఆ త‌ర్వాత మ‌హేష్‌కు వ‌న్‌, ఆగ‌డు ప్లాప్ అయినా శ్రీమంతుడుతో నెంబ‌ర్ వ‌న్ అయ్యాడు. ఇక బ్ర‌హ్మోత్స‌వంతో మ‌ళ్లీ డౌన్ అయ్యాడు. అటు ప‌వ‌న్ గోపాల‌..గోపాల యావ‌రేజ్‌, స‌ర్దార్‌, కాట‌మ‌రాయుడు డిజాస్ట‌ర్ల‌తో బాగా వెన‌క‌ప‌డితే ఇదే టైంలో ఎన్టీఆర్ టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు హిట్ల‌తో కెరీర్‌లోనే పీక్ స్టేజ్‌లో ఉన్నాడు.

ఇలా ఈ ముగ్గురు హీరోలు ఒక్కోసారి ఒక్కొక్క‌రు టాప్ స్టేజ్లో ఉంటున్నారు. దశాబ్ధంపైగానే టాలీవుడ్ నంబర్ ఒన్ హీరో రేసులో ఈ ముగ్గురూ పోటీప‌డుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోల నైజాం మార్కెట్ చూస్తే ఎవ‌రి స‌త్తా ఎంతో తెలిసిపోతోంది. ఎందుకంటే ఈ ముగ్గురు హీరోల తాజా సినిమాల నైజాం రైట్స్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు కొంటున్నారు.

మ‌హేష్‌-మురుగ‌దాస్‌ల స్పైడ‌ర్ నైజాం రైట్స్‌ను రాజు రూ.25 కోట్ల‌కు కొనేయ‌డంతో పాటు అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడ‌ట‌. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న స్పైడర్‌కి ఉన్న నైజాం మార్కెట్ అది. ఇక ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ తాజా సినిమా రైట్స్‌ను రాజు రూ.30 కోట్ల‌కు సొంతం చేసుకునేందుకు ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని టాక్‌.

ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జైల‌వ‌కుశ నైజాం రైట్స్ సొంతం చేసుకునేందుకు రూ.23-25 కోట్ల వ‌ర‌కు భేర‌సారాలు జ‌రుపుతున్నాడ‌ట‌. అయితే ఈ మూడు సినిమాల‌తోనే ఈ హీరోల స్టామినాపై అంచ‌నాకు రాలేం. ఎందుకంటే స్పైడ‌ర్‌కు ఇండియా వైజ్‌గా క్రేజ్ ఉంది. ఇక నితిన్ లాంటి హీరోగ‌ అ..ఆ లాంటి సినిమా తీసి రూ.50 కోట్లు కొల్ల‌గొట్టిన ఘ‌న‌త త్రివిక్ర‌మ్‌దే. ఇక ఈ మూడు సినిమాల్లో ఎన్టీఆర్ సినిమాయే డైరెక్ట‌ర్ ప‌రంగా వీక్‌గా ఉంది. అందుక‌నే ఈ సినిమాల మార్కెట్ విష‌యంలో వీరి స్టామినా లెక్క క‌ట్ట‌డం త‌ప్పే.