బిత్తిరి సత్తికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్టు

February 1, 2017 at 11:41 am
10

బిత్తిరి స‌త్తి.. తెలంగాణ‌లో ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు! ఒక ప్ర‌ముఖ‌ చాన‌ల్ వ‌చ్చే కామెడీ ప్రోగాం ద్వారా రెండు రాష్ట్రాల్లోనూ బాగా పాపుల‌ర్ అయ్యాడు! ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ప్ర‌శంస‌లు అందుకున్నాడు! అయితే ఆ చానెల్‌లో ఉద్యోగం మాని.. ఎమ్మెల్యే అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట. అది కూడా అధికార టీఆర్ఎస్‌లో కాక‌.. కాంగ్రెస్‌లో త‌ర‌ఫున పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. త‌న‌కు ఎమ్మెల్యే అయ్యే స‌మ‌య‌మొచ్చింద‌ని తెగ మురిసిపోతున్నాడు. బుగ్గ కారులో తిర‌గ‌వచ్చ‌ని సంబ‌ర‌ప‌డిపోతున్నాడు!

తెలంగాణ‌లో భూస్థాపిత‌మైన పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయక‌త్వం స‌రికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా పార్టీని గెలిపించే గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించింది. ఇందులో భాగంగా స‌రికొత్త వ్యూహానికి తెర లేపింది. వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోయిన వారికి, 25వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వారికి ఈ సారి టిక్కెట్ ఇవ్వ‌కూడద‌ని నిర్ణ‌యించింది. అలాగే ఏడాది ముందుగానే టిక్కెట్లు కేటాయించాలని కూడా నిర్ణ‌యించింది. ఇప్పుడు ఇదే బిత్తిరి స‌త్తికి బాగా న‌చ్చింద‌ట‌. అందుకే కాంగ్రెస్‌లో చేరితే తాను ఎమ్మెల్యే అయిపోవ‌చ్చ‌ని సంబ‌ర‌ప‌డుతున్నాడు!

త‌న‌కు తెలంగాణలో బాగా పాపులారిటీ ఉంద‌ని, ఎమ్మెల్యే టిక్కెట్ త‌న‌కు కేటాయిస్తే భారీ మెజారిటీతో గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ధీమాగా ఉన్నాడు! స‌త్తి అనే పేరు జాబితాలో చాలని.. ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా ప‌డ‌తాయంటున్నాడు! కొత్త అభ్య‌ర్థులను ప్రోత్స‌హించేందుకే కాంగ్రెస్ పెద్ద‌లు ఈ నిర్ణయం తీసుకున్నార‌ని చెబుతున్నాడు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ సాధించేందుకు కాంగ్రెస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు.

బిత్తిరి సత్తికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్టు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share