ఆంధ్రప్రదేశ్ నేరాలు ఘోరాలు..

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై దృష్టి సారిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తా మని ప్రభుత్వం డప్పులు కొడుతోంది . కాని గత రెండేళ్ల కాలం నుంచి నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే రాష్ట్రంలో నేర శాతం పెరిగిందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 2014 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే నేరాలు గణనీయంగా పెరిగాయి. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు చూస్తే మన రాష్ట్రం ఎందులోనూ తీసిపోనట్లే స్పష్టమవుతోరది. ప్రధానంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీల వేధింపుల కేసుల్లోనూ పెరుగుదల నమోదైంది. 2014లో దేశం మొత్తమ్మీద దాదాపు 28 లక్షల కేసులు నమోదైతే, ఎపిలో 1.14 లక్షల కేసులు నమోదయ్యాయి.

దేశం మొత్తం మీద నమోదైన నేరశాతాన్ని పరిశీలిస్తే 225.07 శాతంతో ఎపి దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీలపై 4.90 శాతంతో మూడో స్థానంలో ఉంటే.. గృహహింసలో 12.49 శాతంతో మూడోస్థానం, అత్యాచార కేసుల్లో 1.89 శాతంతో ఏడోస్థానంలో ఉంది. ఎస్సీ, ఎస్టీలపై హత్యలు, అత్యాచారాలు, హింస, అట్రాసిటీ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఆ మద్యనేప్పుడో ప్రపంచ బాకు అనుబంధ సంస్థ సర్వే చేసింది అందులో ఆంధ్రప్రదేశ్ కు దేశం లో అభివృద్ధి లో రెండో స్థానం ఇచ్చేసిందని తెలుగు దేశం భజన మీడియా మొత్తం పుంఖాను పుంఖాలు గా రాసి కోడై కోసింది.ఇక అదే సంస్థ తాజాగా సర్వే జరపగా ఆంధ్రప్రదేశ్ 14 వ స్థానం లో వుంది,బీహార్ మొదటి స్థానం లో వుంది.దీని గురించి ఎక్కడా మనకు ఇసుమంతైనా వార్త కనిపించదు.అలాగే ఈ నేరాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఐదో స్థానం ,దీని గురిచి కుడా మన పచ్చ మీడియా ఎక్కడా మాట్లాడవు.మాట్లాడే ఒకటి అరా మీడియాల పరిస్థితి ఎలా వుండే చూస్తూనే వున్నాం కదా.