ఆ ఒక్క రాత్రికే గర్భవతినయ్యా:రెజీనా

ముందు కోలీవుడ్‌లో పరిచయమై ఆ తరువాత టాలీవుడ్ కి పరిచయమై ప్రస్తుతం తెలుగులో మంచి డిమాండ్ వున్న ముద్దుగుమ్మ రెజీనా.కుర్రహీరోలతో ఓ రేంజ్ హిట్లు కొట్టేస్తూ దూసుకుపోతోంది.అంతేనా లిప్ లాక్స్ కి కూడా సై అంటూ కుర్రకారుని ఓ ఊపు ఊపేస్తోంది ఈ చిన్నది.

ఇక అసలు విషయానికి వస్తే ఆ మధ్య ఓ సారి బెంగుళూరులో జరిగిన ఘటన ఒకటి బయటికొచ్చింది.అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో స్నేహితురాళ్లతో కలిసి వెళుతుండగా ఈ అమ్మడికి లస్సి తాగాలనిపించిందట.మూయటానికి రెడీ గా వున్న ఓ షాప్ దగ్గరికెళ్లి లస్సి అడగగా అతను చికాకుగా లస్సి లేదు ఏమి లేదు పోండి అని సమాధానం ఇచ్చాడట.వెంటనే ఈ అమ్మడు ఎంతైనా హీరోయిన్ కదా,ఓ సినిమాటిక్ ప్లాన్ వేసింది.ఆ షాప్ అతనితో నేను గర్భవతిని నాకు లస్సి ఇస్తే నిన్ను ఆదేవుడు చల్లగా చూస్తాడు అనేసిందట.పక్కనున్న తన స్నేహితురాళ్లంత ఒక్క సారిగా కంగుతిన్నారట.కరిగిపోయి లస్సి ఇవ్వడం షాప్ వాడి వంతైంది పాపం.

ఇలాంటి తమాషాలు చాలా చేశానని, ఇప్పటికీ చేస్తుంటానని రెజీనా అన్నారు.జాగర్తమ్మో ఇది సోషమీడియా ఇజమ్.పెళ్లి చూపులు అనగానే ముగ్గురు పిల్లలట అని ప్రచారం చేసే కాలం.ఇక నువ్వు గర్భం అది ఇది అంటే ప్రచారం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకో.