రమ్యకృష్ణ అంటే ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్. ఆమె వేయని కాస్ట్యూమ్ లేదు. గ్లామర్ పండించడంలో ఆమెకు ఎలాంటి హద్దులు లేవు. అలా గ్లామర్ డాళ్‌గా టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, హుందాతనంగా ఉండే పాత్రలకు కూడా ప్రాణం పోసింది. హీరోయిన్గా తన హవా అయిపోయిన తరువాత కూడా తల్లి పాత్రల్లో మురిపించింది. ‘బాహుబలి’ సినిమాలో రాజమౌళి శివగామి పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. ఆయన ఈ పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకోవడానికి ఏమాత్రం ఆలోచించలేదు. ఆ పాత్రకు ఆమె అయితేనే అంత వెయిట్ ఇవ్వగలదు అనుకున్నాడు జక్కన్న. అలాగే శివగామి పాత్ర ‘బాహుబలి’కి ది బెస్ట్ అయ్యింది.
ఆ తరువాత ఆమె పేరు మార్మోగిపోయింది. వాణిజ్య ప్రకటనల్లో కూడా నిండైన విగ్రహంతో ఆమె కనిపిస్తోంది. షాపింగ్‌మాల్స్ ప్రచార చిత్రాల్లోనూ, కొన్ని ప్రముఖ ప్రకటనల్లోనూ రమ్యకృష్ణ అందం మెరిసిపోతోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో జూనియర్ హీరోయిన్ అయిన లావణ్యకు ధీటుగా ఆమె అందం ఉంది. నాగర్జునకు సరి జోడీగా చక్కగా కుదిరిపోయింది రమ్యకృష్ణ. మళ్లీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ కోసం కసరత్తులు చేస్తోంది రమ్యకృష్ణ.
ఆమె హీరోయిన్గా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఒకటి రానుందని సమాచారమ్. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బాగా క్రేజ్ ఉంది. అందుకే స్టార్డమ్ ఉన్న రమ్యకృష్ణతో ఒక ప్రముఖ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ‘బాహుబలి’ సినిమా తరువాత ఆమెకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రమ్యకృష్ణ అందం అలాంటిది మరి.