సోనాక్షి సూపర్..ఇరగదీసేసింది

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో హీరోయిన్లు చేయడం మామూలే కానీ.. ఫుల్ ప్లెడ్జెడ్ గా ఓ హీరోయిన్ తో యాక్షన్ సినిమా చేయించే సాహసం అందరూ చేయించలేరు. సోనాక్షి సిన్హాతో ఇప్పుడు అలాంటి సాహసమే చేస్తున్నాడు మురుగదాస్. తమిళ్ లో ఐదేళ్ల క్రితం వచ్చిన మౌనగురు చిత్రాన్ని.. లీడ్ కేరక్టర్ ని అమ్మాయిగా మార్చి మురుగదాస్ తీసిన సినిమానే అకీరా. సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తూ.. యాక్షన్ సీన్స్ ను ఇరగదీసేసింది.

అకీరా.సోనాక్షి చేసిన తాజా చిత్రం. ఓ సాధారణ కాలేజ్ అమ్మాయిని నలుగురు చుట్టుముడితే.. వాళ్లను వేడుకుంటూ ‘ప్లీజ్ గతంలో ఇలా జరిగితేనే నాకు మూడేళ్లు వేస్టయ్యాయి. ఇప్పుడు మిమ్నల్ని కొడితే మళ్లీ కష్టాలు మొదలవుతాయ్’ అంటూ మొదలుపెట్టిన సోనాక్షి.. ట్రైలర్ చివరి వరకూ ఫైట్లు ఇరగదీసేసింది. వేరే అమ్మాయిని పట్టుకోబోయిన పోలీసులు.. అకీరాను పట్టుకెళ్లి పోవడం.. అక్కడ కాల్చేసేందుకు ప్రయత్నించడం.. వారిని చితక్కొట్టేసి.. తనను తాను రక్షించుకోవడం.. ఆ తర్వాత పోలీస్ సిస్టమ్ తో ఫైటింగ్.. అబ్బో ట్రైలర్ లో చెప్పుకోవాల్సిన సంగతులు చాలానే ఉన్నాయి.

Click Here For Trailer

ఈ రేంజ్ లో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా ఓ హీరోయిన్ తో ఇప్పటివరకూ రాలేదంటోంది సోనాక్షి సిన్హా. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ మూవీ.. బాలీవుడ్ లో సెన్సేషన్స్ కు నాంది పలికే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గ్లామర్ డాల్ సోనాక్షి చేసిన అరివీర భయంకరమైన ఫైట్సే ఈ అకీరాకు ప్రధాన ఆకర్షణ. దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ఇందులో అవినీతి పోలీస్ అధికారిగా నటించడం మరో అట్రాక్షన్.ఇక రుస్తుం హీరో అక్షయ్ కుమార్ అయితే ఏకంగా సోనాక్షి ఇలా ఫైట్స్ చేసేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ట్వీట్ చేసాడంటే సోనాక్షి ఏ రేంజ్ లో ఇరగదీసిందో అర్థం చేసుకోవచ్చు.