118 సినిమా రివ్యూ & రేటింగ్ ..హిట్టా పట్టా ..?

March 1, 2019 at 1:59 pm

చిత్రం : 118
న‌టీన‌టులు : కల్యాణ్ రామ్‌, నివేదా థామస్‌, షాలినీ పాండే
సంగీతం : శేఖర్‌ చంద్ర
దర్శకత్వం : కేవీ గుహన్‌
నిర్మాత : మహేశ్‌ కోనేరు

118.. ఈ పేరులోనే ఏదో కొత్త‌ద‌నం.. థ్రిల్లింగ్ ఉంది. టీజ‌ర్‌, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మూస‌కు దూరంగా ఉంటూ..ఎప్పుడూ కొత్త‌కొత్త కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు చేసే హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌. అయితే.. హిట్లు..ఫ‌ట్లు ఆయ‌న‌కు అస్స‌లే ప‌ట్ట‌వు. న‌మ్మిన క‌థ కోసం సినిమాలు చేయ‌డంలో ఆయ‌న ఎప్పుడూ ముందువ‌రుస‌లోనే ఉంటాడు. అయితే.. ఇదే వ‌రుస‌లో మ‌రో స‌రికొత్త కాన్సెప్ట్ 118పేరుతో క‌ల్యాణ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాపై గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆయ‌న‌కు అంచ‌నాలు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో తార‌క్ కూడా ఈ సినిమా అన్న‌య్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంద‌నే ధీమా వ్య‌క్తం చేశాడు. అయితే.. వారి అంచ‌నాలు ఏమేర‌కు నిజ‌మ‌య్యాయో.. లేదో చూద్దాం.

క‌థేమిటంటే..
స‌హ‌జంగా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాలు ఎప్పుడు కూడా ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా బోర్ కొట్ట‌వు. ఇప్పుడు క‌ల్యాణ్‌రామ్ కూడా ఇందులోనే స‌రికొత్త కోణాన్ని తీసుకుని సినిమా చేశాడు. అదేమిటంటే.. నిత్యం క‌ల‌లో జ‌రిగే ఘ‌ట‌న‌పై ఇన్వెస్టిగేష‌న్‌.. అంటే అది నిజమా.. కాదా.. నిజంగా ఆ ఘ‌ట‌న జ‌రిగిందా లేదా.. అని తెలుసుకునే ప‌నిలో క‌ల్యాణ్‌రామ్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టుగా క‌నిపిస్తాడు. క‌ల‌లో ఓ అమ్మాయిని కొంద‌రు కొట్ట‌డం.. ఆ త‌ర్వాత ఆమె ఉన్న కారును పెద్ద బొంద‌లో ప‌డేయ‌డం.. నిత్యం క‌ల్యాణ్‌రామ్‌కు ఎదుర‌వుతుంది. దీనిపై ఆయ‌న ఇన్వెస్టిగేట్ చేయ‌డం.. అందులో షాకింగ్ విష‌యాలు తెలియ‌డం.. అస‌లు ఆ అమ్మాయి ఎవ‌రు..? అనేది మాత్రం తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే..
ఈ సైన్స్ స‌స్పెన్స్ థ్రిల్లింగ్ పాయింట్‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు కేవీ గుహ‌న క‌థ‌ను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడ‌నే చెప్పొచ్చు. తాను చెప్ప‌ద‌ల్చుకున్న విష‌యాన్ని ఎక్క‌డ కూడా ఏ లోటు లేకుండా తెర‌పై ఆవిష్కరించ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యాడు. అయితే మొద‌టి భాగ‌మంతా కూడా ఫ‌టాఫ‌ట్‌గా ప్రేక్ష‌కుడికి బోర్ కొట్ట‌కుండా క‌థ‌ను న‌డిపించాడు. ఇక రెండో భాగంలోనూ బాగానే ఉన్నా.. అక్క‌డ‌క్క‌డ చిన్న చిన్న లాజిక్కులు మిస్ అవ్వ‌డం ప్రేక్ష‌కుడికి కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. మొత్తంగా అన్ని పాత్ర‌ల‌ను ఎలివేట్ చేస్తూ.. 118ని విజ‌య‌వంతంగా న‌డిపించాడు కేవీ గుహ‌న్‌. సినిమాటోగ్రాఫ‌ర్ నుంచి ద‌ర్శ‌కుడిగా మొద‌టి సినిమాతోనే త‌న టేస్ట్ ఏమిటో చెప్పారు.

ఎవ‌రెలా చేశారంటే…
జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్‌ రామ్ న‌ట‌న సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న లుక్ మాత్రం చాలా కొత్త‌గా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంది. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ క‌ల్యాణ్‌రామ్ ఆక‌ట్టుకున్నాడు. నివేదా థామస్ నటన కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది. తెరపై కొద్ది సేపే క‌నిపించినా.. త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అయితే.. థ్రిల్ల‌ర్ సినిమా కావ‌డంతో హీరోయిన్‌ షాలిని పాండే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మిగ‌తా న‌టులు నాజ‌ర్‌, హరితేజ, ప్రభాస్‌ శ్రీను త‌మ‌త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మొత్తంగా.. 118తో క‌ల్యాణ్‌రామ్ మ‌రోసారి గుర్తుండిపోయే పాత్ర‌ను చేశారు.

చివ‌రిగా.. క‌ల్యాణ్ రామ్ క‌ట్టిప‌డేశాడు
రేటింగ్ : 3/5

118 సినిమా రివ్యూ & రేటింగ్ ..హిట్టా పట్టా ..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share