ఎన్టీఆర్ పై బిడ్డింగ్…దక్కించుకునేదెవరు ?

February 28, 2019 at 7:28 pm

లక్ష్మిస్ ఎన్టీఆర్ గమనిక.డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో ఖరీదుకి కొనుక్కున్నారు అని వస్తున్న వార్తల్లోనిజాలు లేవు …ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు Gv films , RGV రాకేష్ రెడ్డిలు అప్డేట్ చేస్తారు. పుకార్లని నమ్మొద్దు.వివరాలు కోసం రాకేష్ +919686319999 ఇది స్థూలంగా లక్ష్మి స్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు ట్విట్టర్ లో ఇచ్చిన వివరణ.

ఇదిలా ఉండగా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాని బిడ్డింగ్ పద్దతిలో అమ్మడానికి రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది.వివరంగా చెప్పాలంటే..సినిమా డిస్ట్రిబ్యూషన్ పైన మక్కువ ఉన్న ఔత్సాహికులెవరైనా ఈ సినిమా పంపిణికోసం ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు.అలాగని ఎదో ఏరియా వారీగానో , జిల్లా వారిగానో,టౌన్ వారిగానో అనుకుంటే పొరపాటే .. ఎందుకంటే లక్ష్మి స్ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ లైన్లో థియేటర్ వారీగా ఇవ్వబోతున్నారు.

ఉదాహరణకి ఎక్కడో కడపలో ఉన్న రవి థియేటర్ రైట్ కోసం ఓ ముగ్గురు వరుసగా 20 , 25 , 30 లక్షలకి దరఖాస్తు చేసుకున్నారనుకుంటే, ముగ్గురిలో 30 లక్షల దరఖాస్తుదారుడికి కడప రవి థియేటర్ లక్ష్మి స్ ఎన్టీఆర్ సినిమా హక్కులు సొంతమవుతాయన్నమాట.అయితే దరఖాస్తు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ కనీస డిపాజిట్ కింద 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ పంపిణి హక్కులు దక్కని పక్షం లో డబ్బు వాపసు ఇవ్వబడుతోందన్నమాట.

ఇప్పటికే బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ రెండుభాగాలు విఫలమవడంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకుంది.అదీగాక అధిక తెలుగు దేశం పార్టీకి కంట్లో నలుసులా మారిన వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉండబోతోందో రాజకీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వర్మ బిడ్డింగ్ విధానం లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ గా అమలు జరిగితే ఇది అందరూ ఆహ్వానించదగిన పరిణామ .ఈ విధానం మొత్తం పంపిణి వ్యవస్థనే ప్రక్షాళన చేస్తూ సమూల మార్పులకి శ్రీకారం చుట్టే అవకాశం వుంది.చూద్దాం వర్మ ఎం చేస్తోడో ఏమో.

ఎన్టీఆర్ పై బిడ్డింగ్…దక్కించుకునేదెవరు ?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share