దేవదాస్ సెట్స్ లో కంట తడి పెట్టిన నాని!

August 17, 2018 at 5:44 pm

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు చాలా సెంటిమెంట్ గా ఉంటుంటారు..వారి కళ్ల ముందు బాధాకరమైన విషయాలు జరిగినా..ఎమెషనల్ సంఘటనలు జరిగినా వెంటనే కన్నీరు పెట్టుకుంటారు. తాజాగా అష్టాచమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని అంచెలంచెలుగా పైకి వచ్చారు. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేని నాని నేచురల్ స్టార్ గా అందరి మనసు దోచారు. ప్రస్తుతం హీరోగా కొనసాగుతూనే బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున, నాని మల్టీస్టారర్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. nani-socialpost

ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్న శాందత్ కేరళ వాసి. ఇటీవల కేరళలో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం ధాటికి చిన్నా..పెద్దా..పేద..ధనిక అనే తేడాలు లేకుండా అక్కడ అందరూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొన్ని చోట్ల అసలు సహాయం చేయడానికి కూడా వీలు లేనంత దుస్థితి నెలకొంది..దాంతో చిన్నపిల్లు ఆకలితో అలమటిస్తున్నారు. article_40035111

సహాయక బృందాలు సాధ్యమైనంత వరకు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. కేరళా వరద బాధితులకు సినీ ఇండస్ట్రీ కూడా అండదండగా నిలబడింది. ఇదిలా ఉంటే..శాందత్ కుటుంబ సభ్యుల గురించి బాధపడుతూ సెట్ లో కన్నీరు పెట్టుకున్నారు..అతన్ని చూసి హీరో నాని సైతం కన్నీరు పెట్టుకున్నారట. శాందత్ కుటుంబ సభ్యులే కాదు అక్కడ ప్రజలు అంతా క్షేమంగా ఉండాలని భగవంతున్ని తల్చుకుంటున్నానని నాని ఓదార్చారట. తన ఆవేదనను ట్విట్ ద్వారా తెలిపాడు నాని.

దేవదాస్ సెట్స్ లో కంట తడి పెట్టిన నాని!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share