తెలుగు హీరోలు ఫామ్‌హౌస్‌లో ఏంచేశారంటే ..!

May 22, 2018 at 3:44 pm
naresh-prakashraj-rajendraprasad

తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లో మంచి వ్య‌వ‌సాయం చేసే రైతు ఉన్నాడు. ఆయ‌న‌కు వ్య‌వ‌సాయం చేయ‌డం అంటే చాలా ఇష్టం. త‌న ఫామ్‌హౌస్‌లో ఆయ‌న‌కు ఇష్ట‌మైన పంట‌ల‌తో పాటు కూర‌గాయ‌లు అవి పండిస్తుంటారు. అలా పండించిన పండ్ల‌ను టాలీవుడ్‌లో కొంత‌మంది హీరోల‌కు ప్ర‌తియేటా పంపుతుంటాడు. అయితే ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక్క‌డే కాదు కొంత‌మంది సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు కూడా వ్య‌వ‌సాయం మీద మ‌క్కువ‌తో హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వ్య‌వ‌సాయం చేస్తున్నారు.

 

 సీనియ‌ర్ న‌టులు ప్ర‌కాష్‌రాజ్‌, న‌రేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌ల‌కు హైద‌రాబాద్ స‌మీపంలో వ్య‌వ‌సాయ క్షేత్రాలు ఉన్నాయి. వీరు సినిమాల్లో న‌టిస్తూనే త‌మ‌కు ఎంతో ఇష్ట‌మైన వ్య‌వ‌సాయం కూడా చేస్తుంటారు. తాజాగా సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఫామ్‌హౌస్‌ను చూసేందుకు తోటి న‌టులు ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ వ‌చ్చారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా న‌రేష్ తెలియ‌జేశారు. 

 

`నా తోటి రైతులు ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ నా ఫామ్‌హౌస్‌కు విచ్చేశారు. వ్య‌వ‌సాయం ప‌ట్ల ప్ర‌కాష్‌రాజ్ చూపించే మ‌క్కువ ఎంతో మందికి ఆద‌ర్శం. చాలా మంది న‌టుల‌ను ఈ వ్య‌వ‌య‌సాయంపై ప్రేమే ఒక్క ద‌గ్గ‌ర‌కు చేరుస్తోంది. త‌న ఫామ్‌హౌస్‌కు రావాల్సిందిగా ప్ర‌కాష్ రాజ్ నన్ను ఆహ్వానించార‌`ని న‌రేష్ ట్వీట్ చేశారు.

తెలుగు హీరోలు ఫామ్‌హౌస్‌లో ఏంచేశారంటే ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share