అడివి శేషు కరెక్టే …మహేష్ బాబు

March 5, 2019 at 5:03 pm

టాలీవుడ్‌ హీరో మ‌హేశ్‌బాబు ఇటీవ‌లే మ‌ల్టీప్లెక్స్ సినిమాస్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మ‌హేశ్‌బాబు.. మేజ‌ర్ సినిమాతో నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టారు. అడివి శేష్ హీరోగా న‌టిస్తున్న మేజ‌ర్ సినిమాకు మ‌హేశ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఘ‌ట్ట‌మ‌నేని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో మేజ‌ర్ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పారు.

మేజ‌ర్ సినిమాను మేజ‌ర్ ఉన్ని కృష్ణ‌న్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. అయితే.. ‘మేజర్‌’ సినిమాను ఎందుకు తీయాలనుకున్నారు? అందులో ఆయన నటించకపోవడానికి కారణాలు ఏమిటి..? అడివి శేష్‌నే ఎంపిక చేయ‌డానికి కార‌ణం ఏమిటి..? ఇలా ప‌లు ప్రశ్నలకు మ‌హేశ్‌బాబు సమాధానం ఇచ్చారు. “నేను యాక్టివ్‌ నిర్మాతను కాను. కానీ ప్రేక్షకులకు చూపించి తీరాల్సిన కథలు కొన్నుంటాయి. అలాంటివాటిలో ‘మేజర్‌’ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో నేను నటించేవాడ్నే. కానీ అన్ని సినిమాల్లోనూ నేనే నటించలేను కదా?“ అంటూ మ‌హేశ్ చెప్పుకొచ్చారు.

అంతేగాకుండా.. ‘మేజర్‌’ సినిమాకు తాను నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని… మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ గురించి శేష్‌ చాలా పరిశోధన చేశారని… ఈ పాత్రకు ఆయనే సరిపోతారనిపించిందని అని మ‌హేశ్ త‌న మ‌న‌సులోని మ‌ట‌ను చెప్పారు. అలాగే మ‌హేశ్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న‌ ‘మహర్షి’ చిత్రానికి సంబంధించిన ప‌లు విష‌యాలు కూడా వెల్ల‌డించారు. మ‌హ‌ర్షి సినిమా త‌న‌ హృదయానికి బాగా దగ్గరగా ఉంద‌ని.. అంద‌ర‌మూ చాలా కష్టపడుతున్నామ‌ని ఆయ‌న అన్నారు. త‌న‌ కెరీర్‌లో మ‌హ‌ర్షి సినిమా మరో ల్యాండ్‌మార్క్‌ చిత్రంగా నిలిచిపోతుందని మ‌హేశ్ చెప్పారు.

అడివి శేషు కరెక్టే …మహేష్ బాబు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share