‘ వివేగం ‘ (వివేకం) 2 డేస్ క‌లెక్ష‌న్స్‌….. బాక్సాఫీస్ షేక్‌

అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ వివేగం. తెలుగులో వివేకం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌లో వీరంగం ఆడేస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు బెనిఫిట్ షోస్ తో కలిపి ఏకంగా 33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గురువారం రిలీజ్ అవ్వ‌డంతో లాంగ్ వీకెండ్‌తో పాటు వినాయ‌క‌చ‌వితి, శ‌ని, ఆదివారాలు సినిమాకు క‌లిసొచ్చాయి.

రెండో రోజు కూడా భారీ వసూళ్లను సాధించిన వివేకం రెండు రోజుల్లోనే ఏకంగా 66 కోట్ల వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించింది. ఇక మూడో రోజు శ‌నివారం కూడా రూ. 15 కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల ప్రాథ‌మిక స‌మాచారం. ఇప్ప‌టికే రూ. 81 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసిన ఈ సినిమా ఆదివారం కూడా మంచి వ‌సూళ్లు సాధించే ఛాన్సులు ఉండ‌డంతో ఫ‌స్ట్ వీకెండ్‌కే రూ. 100 కోట్ల వ‌సూళ్లు సాధిస్తుంద‌ని లెక్క వేస్తున్నారు.

అజిత్ – శివ కాంబోలో వ‌చ్చిన వీర‌మ్ (వీరుడొక్క‌డే), వేదాళం సినిమాల త‌ర్వాత వ‌రుస‌గా వ‌చ్చిన సినిమా కావ‌డంతో వివేగం (వివేకం)పై సౌత్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నా క‌థాప‌రంగా వీక్‌గా ఉంద‌ని మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినా వ‌సూళ్లు మాత్రం అదిరిపోతున్నాయి.

రూ. 100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెరెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ. 120 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. అజిత్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా అక్ష‌ర‌హాస‌న్ ప్రధాన‌పాత్ర‌లో న‌టించింది.