‘ హ‌లో ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

December 23, 2017 at 12:01 pm
akhil-hello-1st day collections-TJ

అఖిల్‌ను హ‌లో సినిమాతో రీ లాంచ్ చేస్తున్నాన‌ని అక్కినేని నాగార్జున ముందే ప్ర‌క‌టించాడు. తొలి సినిమా అఖిల్ ప్లాప్ కావ‌డంతో హ‌లో సినిమా విష‌యంలో నాగార్జున అతి జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ ఈ సినిమాను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించాడు. విక్ర‌మ్ కుమార్ లాంటి ఇంటిలిజెంట్ డైరెక్ట‌ర్ ఉన్నా కూడా నాగార్జున ప్ర‌తీ సీన్ చూశాక ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకుని త‌న ఇన్వాల్‌మెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకున్నాడ‌న్న టాక్‌ కూడా వ‌చ్చింది. 

హ‌లోకు తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్లో కూడా మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. ఓవ‌ర్సీస్ మార్కెట్ తెలుగు సినిమాల‌కు మంచి అక్ష‌య‌పాత్ర‌గా మారిన నేప‌థ్యంలో ప్ర‌తి తెలుగు సినిమా ఓవ‌ర్సీస్ మార్కెట్ మీద ప్ర‌త్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేస్తోంది. తెలుగు సినిమాకు ఓవ‌ర్సీస్లో మంచి రేటు ప‌లుకుతోంది.

హ‌లో సినిమా యూనిట్ కూడా ముందు నుంచే ఓవ‌ర్సీస్‌లో స్పెష‌ల్‌గా కాన్‌సంట్రేష‌న్ చేసింది. అక్క‌డ అఖిల్ లైవ్ డ్యాన్సులు చేయ‌డంతో పాటు రానా – అఖిల్ తెలుగు వారితో ప్ర‌త్యేకంగా మీట్ అయ్యారు. ఈ ప్ర‌మోష‌న్లు హ‌లోకు మంచి ప్ర‌చారం తెచ్చిపెట్టింది. అలాగే హ‌లోకు భారీ ఎత్తున హ‌లో ప్రీమియ‌ర్లు ప్లాన్ చేయ‌డంతో హ‌లోకు కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే 133 లొకేషన్లలో కలిపి ఈ సినిమాకు 1.87 లక్షల డాలర్లు వసూలయ్యాయి. 

అఖిల్ సినిమాతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ‌. అఖిల్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఇక హ‌లో రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్ల వివ‌రాలు రావాల్సి ఉంది.

‘ హ‌లో ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share