అఖిల్ స‌క్సెస్ బాధ్య‌త మెగా బ్యాన‌ర్‌దే..!

February 17, 2019 at 11:48 am

అక్కినేని కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన హీరోలంద‌రూ దాదాపుగా మొద‌టి సినిమాతోనే పాపులారిటీ సంపాదించారు. నాగ‌చైత‌న్య తాను చేసిన మొద‌టి సినిమా ఏం మాయ చేసావెతోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. నాగార్జున పేరుతోగాకుండా.. త‌న‌దైన న‌ట‌న‌తోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. కానీ.. అక్కినేని అఖిల్ మాత్రం ఇంకా సెట్ అవ్వ‌డం లేదు. ఇప్ప‌టికీ మూడు సినిమాలు చేసినా.. స‌క్సెస్ సాధించ‌లేపోయాడు.8843-allu-aravind

అక్కినేని నట వారసుడిగా అఖిల్‌, తన మీద ఉన్న అంచనాలను అందుకోలేక‌పోతున్నాడు. ఆయ‌న ఆ త‌డ‌బాటు మాత్రంపోవ‌డం లేదు. ఇటీవ‌ల వ‌చ్చిన మిస్ట‌ర్ మజ్ను సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టులేక‌పోయాడు. అయితే ఇప్ప‌టికీ నాగార్జున ఇమేజ్‌తోనే నెట్టుకొస్తున్నాడు. అయితే.. ఆయ‌న‌లో ప్ర‌య‌త్నం మాత్రం ఆగ‌లేదు. ఏదో ఒక‌రోజు త‌న‌ది అవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ముందుకు వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ యంగ్ హీరో తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. Akhil-Akkineni-Making-Another-Wrong-Move

అయితే.. అఖిల్ స‌క్సెస్ కోసం అటు నాగార్జున సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అఖిల్ స‌క్సెస్‌ను మెగా బ్యానర్‌కు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. అఖిల్‌ నాలుగో సినిమాను మెగా బ్యానర్‌లో తెరకెక్కించే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. అఖిల్‌ను ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టే బాధ్య‌త‌ను అల్లు అరవింద్ తీసుకున్నట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఇప్పటికే గీత గోవిందం ఫేం పరశురాం, బొమ్మరిల్లు భాస్కర్‌లు అఖిల్ కోసం కథలు రెడీ చేస్తున్నారట. ఇక‌ వీరిలో ఎవరి కథకు అఖిల్ ఓకే చెబుతారో చూడాలి మ‌రి.

అఖిల్ స‌క్సెస్ బాధ్య‌త మెగా బ్యాన‌ర్‌దే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share