డిజాస్ట‌ర్ దిశ‌గా… ‘ నా పేరు సూర్య!

May 10, 2018 at 12:47 pm
allu arjun-

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు చాలా రోజులు త‌ర్వాత డిజాస్ట‌ర్ రాబోతుందా ? అంటే నా పేరు సూర్య క‌లెక్ష‌న్లు చూస్తుంటే అవున‌న్న ఆన్స‌రే ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. బ‌న్నీ సినిమాలు చూస్తే రేసుగుర్రం నుంచి దూసుకుపోతున్నాడు. రేసుగుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి, స‌రైనోడు సినిమాలు వ‌రుస‌గా హిట్ అవ్వ‌డంతో పాటు రూ.55 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టాయి. అంతెందుకు బ‌న్నీ చివ‌రి సినిమా డీజే ప్లాప్ అయినా రూ.70 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా షేర్ రాబ‌ట్టి బ్రేక్ ఈవెన్ దాటేసింది.

 

క‌ట్ చేస్తే ఈ క్రేజ్ నేప‌థ్యంలో వ‌చ్చిన నా పేరు సూర్య యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నా, దేశ‌భ‌క్తి నేప‌థ్యంతో ముడిప‌డిన చిత్రం అని పేరు వ‌చ్చినా క‌లెక్ష‌న్ల‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. మంగ‌ళ‌వారానికే తేలిపోయిన సూర్య‌, బుధ‌వారం మ‌హాన‌టి దెబ్బ‌తో ఇంకా వీక్ అయ్యింది. ఇక శుక్ర‌వారం మెహ‌బూబా రావ‌డంతో నా పేరు సూర్య డిజాస్ట‌ర్ దిశ‌గా వెళుతోంది.

 

సోమ‌వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 2.79 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా, మంగ‌ళ‌వారం కేవ‌లం రూ 2.36 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా చూస్తే ఈ సినిమా పెట్టుబ‌డి, అమ్మ‌కాల‌తో పోలిస్తే 60 శాతానికి కాస్త అటూ ఇటూగా మాత్ర‌మే రిక‌వ‌రీ చేసే ఛాన్సులు ఉన్నాయి. అంటే 40 శాతం వ‌ర‌కు ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టిన వాళ్లు భారీగా న‌ష్ట‌పోక త‌ప్పే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ లెక్క‌న చూస్తే సూర్య డిజాస్ట‌ర్ అయిన‌ట్టే.

 

నా పేరు సూర్య 5 డేస్ ఏరియా వైజ్ షేర్ :  ( రూ.కోట్ల‌లో)

నైజాం – 10.8

 

సీడెడ్ – 5.11

 

ఉత్త‌రాంధ్ర – 4.18

 

గుంటూరు – 3.64

 

ఈస్ట్ – 3.05

 

వెస్ట్ – 2.34

 

కృష్ణా – 2.20

 

నెల్లూరు – 1.26

———————————–

ఏపీ+తెలంగాణ = 32.58 కోట్లు

————————————-

డిజాస్ట‌ర్ దిశ‌గా… ‘ నా పేరు సూర్య!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share