‘ నా పేరు సూర్య ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్షన్స్‌…. బ‌న్నీ దెబ్బ మామూలుగా లేదుగా

May 12, 2018 at 1:08 pm
allu arjun- 7days collection s

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య‌. టాలీవుడ్ స్టార్ స్టోరీ రైట‌ర్ వ‌క్కంతం వంశీ మెగాఫోన్ ప‌ట్టిన ఈ సినిమాలో బ‌న్నీ మిల‌ట్రీ ఆఫీస‌ర్‌గా న‌టించాడు. బ‌న్నీ కెరీర్‌లో ఇమేజ్‌కు భిన్నంగా కొత్త‌గా ట్రై చేసిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. దేశ‌భ‌క్తి సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అనుకున్నా అంచాన‌లు అందుకోలేకపోయింది.

 

డీజే లాంటి బిలో యావ‌రేజ్ సినిమాల‌తో కూడా టాప్ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్టిన బ‌న్నీకి నా పేరు సూర్య పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి నా పేరు సూర్య సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.48 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. ఇప్ప‌టికే చాలా చోట్ల సినిమాను లేపేశారు. మ‌రో వైపు మ‌హాన‌టి సినిమాకు బ్ర‌హ్మాండ‌మైన టాక్ రావ‌డంతో సూర్య‌పై ఆ ఎఫెక్ట్ గ‌ట్టిగానే ప‌డింది.

 

రూ.80 కోట్ల షేర్ రాబ‌ట్టాల్సిన ఈ సినిమా మ‌రో 35 కోట్ల షేర్ రాబ‌ట్టాల్సి ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అది అసాధ్యంగానే క‌నిపిస్తోంది. ఈ లెక్క‌న చూస్తే సూర్యతో బ‌న్నీ డిస్ట్రిబ్యూట‌ర్ల నెత్తిన పెద్ద గుదిబండ‌నే ప‌డేశాడు.

 

నా పేరు సూర్య ఫ‌స్ట్ వీక్ ఏరియా వైజ్ షేర్ (రూ.కోట్ల‌లో)

 

నైజాం – 11.30

 

సీడెడ్ – 5.85

 

నెల్లూరు – 1.36

 

కృష్ణా –  2.33

 

గుంటూరు – 3.70

 

వైజాగ్ – 4.55

 

ఈస్ట్ –  3.20

 

వెస్ట్ –  2.47

——————————-

ఏపీ & టీస్ షేర్ = 34.76

——————————-

 

కర్ణాటక – 5.10

 

తమిళ‌నాడు – 2.30

 

కేరళ – 1.60

 

ఓవర్సీస్ – 4.00

————————————————- 

మొదటి వారం వరల్డ్ వైడ్ షేర్ = 47.76

————————————————-

‘ నా పేరు సూర్య ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్షన్స్‌…. బ‌న్నీ దెబ్బ మామూలుగా లేదుగా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share