హిట్ డైరెక్టర్లనే లైన్లో పెట్టేసిన బన్నీ

June 14, 2018 at 5:52 pm

మెగా కంపౌండ్ నుండి వచ్చిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు .అల్లు అర్జునకు మాస్ క్లాస్ ఫాలోయింగ్ ఎక్కువే. వరస హిట్లతో దూసుకుపోయిన అల్లు అర్జునకు దువ్వాడ జగన్నాధం నుండి ఈ మధ్య కాలంలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాలు ఘోరపరాజయాలు మూటగట్టుకున్నాయి .ఇదే సమయంలో మిగతా హీరోలంతా హిట్లతో దూసుకుపోతుంటే అల్లు అర్జున్ మాత్రం సినిమాలు ప్లాప్ బాట పట్టాయి . 

 

దాంతో బన్నీ తన తరువాతి చిత్రాన్ని జాగ్రత్త గా అల్లు అర్జున్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన చేయబోయే సినిమాలపై  అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కె కుమార్ భారీ బడ్జెట్ తో ఒక భారీ సినిమాని తీయబోతున్నారని కొన్నిరోజులగా వార్తలు  ఫిలిం నగరంలో వినిపిస్తున్నాయి . సడెన్ సర్ప్రైజ్ గా  తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ , సురేందర్ రెడ్డి లు చేరారు వీరితో కూడా బన్నీ సినిమాలు చేయనున్నాడని సమాచారం.

 

ఇంతకు ముందు బన్నీ త్రివిక్రమ్ తో ‘జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేశాడు రెండు సినిమాలు హిట్ సాధించాయి ఇక మరొక డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ‘రేసుగుర్రం’ సినిమా చేశాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని  అల్లు అర్జున్ సాధించాడు . మరి అల్లు అర్జున్ వీరిలో ఎవరి సినిమాని ముందు మొదలు పెడతారో లేదో చూడాలి. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ తో కలిసి పారిస్ వెళ్లారు.

హిట్ డైరెక్టర్లనే లైన్లో పెట్టేసిన బన్నీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share