డేటింగ్ ఎవ‌రితోనో రివీల్ చేసిన శ్రీముఖి

బుల్లితెర‌, వెండితెర రంగంలో హీరోలు, హీరోయిన్లు, యాంక‌ర్లు, ఇత‌ర టెక్నీషీయ‌న్లు టాప్ స్టేజ్‌లో ఉంటే వారిమీద గాసిప్పులు రావ‌డం స‌హ‌జం. అది ఈ గ్లామ‌ర్‌కు స‌హ‌జంగా ఉండే ల‌క్ష‌ణం. బుల్లితెర మీద హాట్ హాట్ యాంక‌ర్‌గా పేరున్న శ్రీముఖికి ఇక్క‌డ పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా శ్రీముఖి తాను ఓ వ్య‌క్తితో డేటింగ్‌లో ఉన్నాన‌ని ఓపెన్‌గా అత‌డి పేరు చెప్ప‌డంతో పాటు అందులో త‌ప్పేముంద‌ని ఎదురు ప్ర‌శ్న‌తో అంద‌రికి షాక్ ఇచ్చింది.

ఇంత‌కు శ్రీముఖి ఎవ‌రి పేరు చెప్పిందో తెలుసా…అత‌డు ఎవ‌రో కాదు ప‌టాస్‌లో శ్రీముఖి కో యాంక‌ర్ ర‌వి. ప‌టాస్ షోలో రెచ్చిపోయి ఆన్‌స్క్రీన్ మీద హాట్ రొమాన్స్ చేసే ఈ జంట డేటింగ్‌లో ఉంద‌ట‌. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ఆలీతో ఆలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్‌కు వ‌చ్చిన ఈ జంట ఈ విష‌యాన్ని రివీల్ చేశారు.

ఈ షోలో ఆలీ ర‌వి అంటే ఏంట‌ని శ్రీముఖికి ఓ ప్ర‌శ్న వేశాడు. వెంట‌నే శ్రీముఖి ర‌వి అంటే నాకు పిచ్చి పిచ్చి, చిల్ల‌ర అబ్బాయిలు అంటే నాకు ఇష్టం అని చెప్పింది. మీరు డేటింగ్‌లో ఉన్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌లు అన‌గానే శ్రీముఖి అవును మేం డేటింగ్‌లో ఉన్నాం… రెండు సంవ‌త్స‌రాల నుంచి క‌లిసే యాంక‌రింగ్ చేస్తున్నాం… బ‌య‌ట కూడా క‌లుసుకుంటాం…అందులో త‌ప్పేముంద‌ని చెప్పింది. శ్రీముఖి ఒక్క‌సారిగా ర‌వితో డేటింగ్ మ్యాట‌ర్ అలా రివీల్ చేయ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. అయితే శ్రీముఖి దీనిని సీరియ‌స్‌గా చెప్పిందా ? లేక కామెడీగా చెప్పిందా ? అన్న‌దే అస‌లు ట్విస్ట్‌. అది మీకే వ‌దిలేస్తున్నాం.

Sree mukhi And Anchor ravi