ఆంధ్ర ఫిష్ తింటే ఇక అంతే సంగతులు..!

July 17, 2018 at 5:46 pm

ఈ మద్య కొంత మంది జనాలు డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు.  ముఖ్యంగా మనం తింటున్న తిండిలో ప్రతిదీ కలుషితం అవుతుందని రోజూ వార్తల్లో చూస్తునే ఉన్నాం.  కాకపోతే అవి కలుషితం అవుతున్నాయని ప్రత్యక్షంగా చూడలేక పోతున్నాం కనుక కొనుగోలు చేస్తున్నాం.  ముఖ్యంగా కూరగాయలు, తినే పండ్లు, తాగే పాలు, వండుకునే పదార్ధాల్లో ఎన్నో నకిలీలు, కలుషితం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే  ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చేపల్లో క్యాన్సర్ కారక, విషపూరిత ఫార్మాలిన్ అనే రసాయనం ఆనవాళ్లు ఉన్నాయంటూ అస్సాం ప్రభుత్వం ఆ చేపలపై 10 రోజుల పాటు నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆంధ్రా చేపలను పరీక్షించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో చేపలు తినాలంటే చాలామందిలో భయం కలుగుతోంది. అసలు ఫార్మాలిన్ అంటే ఏమిటి?5249110852_5bc290957a_b

 

నిజంగానే ఆంధ్రప్రదేశ్ రైతులు ఈ రసాయనాన్ని చేపలకు పూస్తున్నారా? ఎవరైనా చేపలకు ఫార్మాలిన్ పూస్తే.. ఆ చేపలను గుర్తించడమెలా? ఫార్మాలిన్ పూసిన చేపలను తింటే ఏమవుతుంది?

ఈ ప్రశ్నలకు ముంబయిలోని ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ’ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎల్.ఎన్ మూర్తి కొన్ని సూచనలు అందించారు. 

 

రసాయనాలు కలిపిన  చేప ఎలా ఉంటుంది సాధారణంగా ఫార్మాలిన్ కలిపిన చేపల వాసనలో తేడా కనిపిస్తుంది. ఆ చేపలను చేతితో తాకినప్పుడు కాస్త గరుకుగా ఉంటాయి ఈ తేడాలు కనిపిస్తే ఫార్మాలిన్ కలిపినట్టు ఒక అంచనాకు రావచ్చు. కానీ కచ్చితంగా చెప్పలేం

 

మరి స్పష్టంగా గుర్తించేదెలా?

చేపల్లో ఫార్మాలిన్‌ ఆనవాళ్లను స్పష్టంగా గుర్తించేందుకు కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ’ పరిశోధకులు ఓ కిట్ తయారు చేస్తున్నారు.

 

చేపకు ఫార్మాలిన్‌ రసాయనం పూశారా.. లేదా అన్నది ఆ కిట్‌ సాయంతో 5 నిమిషాల్లోనే గుర్తించవచ్చని ఎల్.ఎన్ మూర్తి తెలిపారు.  “చిన్నప్పుడు భౌతిక శాస్త్రంలో లిట్మస్ పేపర్ పరీక్ష గురించి చదువుకున్నాం కదా.. అలాగే ఈ కిట్‌తో చేపలను పరీక్షించవచ్చు. ముందుగా ఆ కిట్‌లోని పేపర్ ముక్కతో చేపను రుద్దాలి. తర్వాత ఆ చేప మీద అదే కిట్‌లో ఉండే రసాయనం(కెమికల్) చుక్కలు వేయాలి. అప్పుడు ఫార్మాలిన్ ఉన్న చేప ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది” ఆయన వివరించారు.

 

ఎంత ప్రమాదకరం?

ఫార్మాల్డిహైడ్‌కి, కేన్సర్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని 1987లో అమెరికా ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ(ఈపీఏ)కు చెందిన పరిశోధకులు గుర్తించారు. 2011లో దీన్ని కేన్సర్ కారకాల జాబితాలో చేర్చారు. శరీరంలోకి ఫార్మాలిన్ వెళ్తే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యాలోని ఓ ఆస్పత్రిలో మహిళకు వైద్యలు సెలైన్‌కు బదులుగా.. ఫార్మాలిన్  ద్రావణాన్ని ఎక్కించడంతో ఆమె కోమాలోకి వెళ్లి చనిపోయారు. 

 

మొత్తానికి రసాయనాలు పూసిన చేపలు వెంటనే గుర్తించి వాటికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

ఆంధ్ర ఫిష్ తింటే ఇక అంతే సంగతులు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share