బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ వైఫ్ బ‌స‌వ‌తార‌కంగా యంగ్ హీరోయిన్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం రెండు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల సంద‌డి స్టార్ట్ అయ్యింది. ఈ రెండు బ‌యోపిక్‌లు సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని తెర‌కెక్కుతున్న‌వే అయినా రెండు వేటిక‌వే డిఫ‌రెంట్ క‌థాంశాల‌తో తెర‌కెక్కుతున్న‌వి. వ‌ర్మ బ‌యోపిక్ పూర్తిగా కాంట్ర‌వ‌ర్సీ స్టైల్లో తెర‌కెక్కుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇవ్వ‌డం, ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు సీఎం పీఠం నుంచి దించేసి ఎక్క‌డం..ఇలా ఎన్టీఆర్ జీవితంలో చివ‌రి రోజుల‌తో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తెర‌కెక్క‌నుంది.

ఇక ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ హీరోగా – నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన తేజ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ పూర్తిగా ఎన్టీఆర్‌లోని పాజిటివ్ అంశాలు, ఆయ‌న తెలుగు జాతి ఔన్న‌త్యాన్ని చాటిన అంశాల‌తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మే 28న రిలీజ్ చేస్తున్న‌ట్టు డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం రోల్‌లో యంగ్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను ద‌ర్శ‌కుడు తేజ సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. మ‌ళ‌యాళ ప్రేమ‌మ్ సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన అనుప‌మ తెలుగులో ప్రేమ‌మ్‌, అ..ఆ , ఈ యేడాది సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో మ‌న ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది.

ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం రోల్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ రోల్‌కు ఈ యంగ్ హీరోయిన్‌ను తేజ సంప్ర‌దించ‌డంతో ఆమె కాస్త టైం తీసుకుని త‌న డెసిష‌న్ చెపుతాన‌ని అన్న‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్‌. మ‌రి బాల‌య్య ప‌క్క‌న అనుప‌మ బ‌స‌వ‌తార‌కం రోల్‌కు ఎంపికైతే న‌ట‌నా ప‌రంగా ఆమె బాగా మెప్పిస్తుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.