ఎట్టకేలకు అనుష్క కు పెళ్లి కుదిరిందోచ్..!

June 12, 2018 at 10:15 am
anushka-marrage

స్విటీ బ్యూటీ అనుష్క పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసిందా ?  ఆమె త్వ‌ర‌లోనే సంసార జీవితంలోకి ఎంట్రీ ఇవ్వ‌నుందా ? అంటే అవున‌నే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా స్టార్ హీరోల‌కు ధీటుగా ఎదిగిన అనుష్క ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసింది. ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా ఆమె మాత్రం ఇప్ప‌ట‌కీ సినిమాల్లో టాప్ ఛాన్సులు ద‌క్కించుకుంటూనే ఉంటోంది. 

 

ఈ బ్యూటీకి త్వరలో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు తీవ్రంచేస్తున్నారు. అనుష్కపై పెళ్లిపై యేడాది కాలంగా గాసిప్పులు ప్ర‌చారం అవుతూనే ఉన్నాయి. ఆమె యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతోంద‌ని గాసిప్పులు రాగా వాటిని అనుష్క‌, ప్ర‌భాస్ ఇద్ద‌రూ ఖండించారు. అనుష్కను ప్రభాస్‌ పెళ్లి చేసుకోవడానికి ఆయన కుటుంబసభ్యులు అంగీరించలేదనే ప్రచారం కూడా జరిగింది.  

 

ఇక అనుష్క కొద్ది రోజులుగా కొత్త సినిమాలు ఒప్పుకోవ‌డం లేదు. రెండేళ్లుగా అనుష్క‌కు పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప‌లు సంబంధాలు చూస్తున్నా సెట్ కావ‌డం లేదు. జాతక దోషం ఉందని జ్యోతిష్కులు చెప్పడంతో దోషం నివారణ కోసం ఇటీవల అనుష్కతో దైవ పూజలు నిర్వహించారు. ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి ఈ స్వీటీ ఓకే చెప్పిందట. వ‌రుడు ఎవ‌ర‌నే వివ‌రాలు బ‌య‌ట‌కు రాక‌క‌పోయినా అత‌డు బెంగ‌ళూరుకు చెందిన వ్య‌క్తిగా తెలుస్తోంది. ఈ యేడాదే అనుష్క పెళ్లి ఉండ‌వ‌చ్చ‌ని స‌మాచారం.

ఎట్టకేలకు అనుష్క కు పెళ్లి కుదిరిందోచ్..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share