అనుష్క ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన అనుష్క తల్లి

July 19, 2018 at 5:16 pm
Anushka-Mother-Prabhas

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరూ అంటే వెంటనే గుర్తుకు వస్తారు..ప్రభాస్.  రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ కి పెళ్లి ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి..కానీ కృష్ణం రాజు అదేమీ లేదని తేల్చి చెప్పారు. మొదట ఈ జంట బిల్లా సినిమాలో నటించారు.  తర్వాత  కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో అనుష్క-ప్రభాస్ జంట చూడ ముచ్చటగా ఉందని అన్నారు.  ఇదే జంట బాహుబలి, బాహుబలి 2లో నటించారు. anushka-in-prabhass-saaho

 

 దాంతో ఇండస్ట్రీలో అనుష్క-ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని..వారి మద్య గాఢమైన ప్రేమ ఉందని రక రకాల వార్తలు వచ్చాయి.  అయితే ఈ విషయంపై అనుష్క, ప్రభాస్ లు క్లారిటీ ఇచ్చారు..తాము  మంచి స్నేహితులం అని..ప్రేమ లేదని తమపై వస్తున్నవన్నీ రూమర్లు అని కొట్టిపడేశారు.  తాజాగా ఈ రూమర్లపై అనుష్క తల్లి స్పందించారు.  ‘‘వాళ్లిద్దరూ స్టార్స్.. అలాగే ఇద్దరూ కలిసి నటించారు. నాకు అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్‌ కావాలనే ఉంది. 1490591230_prabhas-rana-daggubati-anushka-shetty-tamannaah-baahubali-2-pre-release-event

 

కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. వారి పెళ్లి గురించి రూమర్స్ స్ర్పెడ్ చేయడం ఆపండి’’ అని తెలిపారు. ఆ మద్య అనుష్క కూడా ఈ విషయంపై స్పందిస్తూ..‘‘ప్రభాస్, నేను పెళ్లి చేసుకోవడం లేదు. దయచేసి రియల్ లైఫ్‌లో బాహుబలి, దేవసేన కెమిస్ట్రీని ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు… అది స్క్రీన్ వరకూ మాత్రమే’’ అని తెలిపింది. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనుష్క భాగమతి తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు.Prabhas-Was-Worried-to-Call-Anushka-Shetty-Mother

అనుష్క ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన అనుష్క తల్లి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share