‘అరవింత సమేత’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ముహర్తం ఖరారు!

September 21, 2018 at 11:29 am

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘అరవింత సమేత’త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. మొదటి సారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి తీస్తున్నాడు. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే పాటలకు సోషల్ మీడియాలో అద్బుతమైన రెస్పాన్స్ వస్తున్నా..ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టు ఉంటాయా..లేవా అన్నది సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది.

సినిమా మొదటి భాగం ఎంట్రటైన్ మెంట్ గా సాగుతూ..ఇంట్రవెల్ తర్వాత పూర్తిగా యాక్షన్, సెంటిమెంట్, ఎమోషనల్ గా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలుపుతుంది. పెనిమిటి అనే పాట చూస్తే..ఈ సినిమా ఎంత సెంటిమెంట్ ఉంటుందో అర్థం అవుతుంది. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో సాగే ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు సన్నాహాలు మొదలయ్యాయి.

ఈ వేడుక ను అక్టోబర్ 1న గాని లేదా గాంధీ జయంతి రోజు 2వ తేదీన గాని జరుపాలని అనుకుంటున్నారట దర్శకనిర్మాతలు. కాకపోతే ఈ వేడుకు ఎక్కడ అనే విషయాన్ని ఇంకా కన్ఫామ్ చేయాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈషా రెబ్బా , నాగబాబు , జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

‘అరవింత సమేత’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ముహర్తం ఖరారు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share